ప్రతిష్టాత్మక దేవధర్ ట్రోఫీ విజేతగా 'భారత్ బీ' జట్టు నిలిచింది. రాంచీ వేదికగా 'భారత్ సీ'తో జరిగిన ఫైనల్లో 51 పరుగుల తేడాతో నెగ్గింది. పార్థివ్ పటేల్ సారథ్యంలోని 'భారత్ బీ' మొదట బ్యాటింగ్ చేసి... నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 283 పరుగులు చేసింది. కేదార్ జాదవ్(86), యశస్వీ జైస్వాల్(54) అర్ధశతకాలతో ఆకట్టుకున్నారు. 'భారత్ సీ' బౌలర్లలో ఇషాన్ పోరెల్ 5 వికెట్లతో సత్తా చాటాడు.
284 పరుగుల లక్ష్య ఛేదనలో బరిలో దిగిన 'ఇండియా సీ' జట్టు ఆరంభంలోనే కెప్టెన్ శుభ్‌మన్ గిల్ వికెట్ కోల్పోయింది. అనంతరం వన్‌డౌన్‌లో వచ్చిన ప్రియమ్ గార్గ్ (74) అద్భుతంగా ఆడాడు. మరో ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (28) పర్వాలేదనిపించాడు. అయితే జట్టు స్కోరు 56 వద్ద మయాంక్‌ను బోల్తా కొట్టించాడునదీమ్.
ఆ తర్వాత ఇండియా-సీ వరుసగా వికెట్లు చేజార్చుకొని 77/5 స్కోరుతో కష్టాల్లో పడింది. ఈ క్రమంలో అక్షర్ పటేల్ (38), జలజ్ సక్సేన (37*), మయాంక్ మార్కండె (27) ఆచితూచి ఆడారు. ఓ వైపు చేయాల్సిన రన్‌రేట్ పెరగడం, బౌలర్లు కట్టుదిట్టంగా బంతులు వేయడం వల్ల ఇండియా సీ 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 232 పరుగులు మాత్రమే చేయగలిగింది.