దిల్లీ క్యాపిటల్స్ బౌలర్ల ధాటికి రాజస్థాన్ రాయల్స్ బ్యాట్స్మెన్ బెంబేలెత్తిపోయారు. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 115 పరుగులే చేయగలిగింది రాజస్థాన్. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ రహానే సేన దిల్లీ బౌలర్ ఇషాంత్ శర్మ చెలరేగడం వల్ల 30 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
అనంతరం బ్యాటింగ్కు వచ్చిన రియన్ పరాగ్, శ్రేయస్ గోపాల్ కాస్త జాగ్రత్తగా ఆడారు. కాసేపటికే శ్రేయస్ గోపాల్, స్టువర్ట్ బిన్నీలను అమిత్ మిశ్రా వరుస బంతుల్లో పెవిలియన్ చేర్చాడు. రియాన్ పరాగ్ ఒక్కడే అర్ధశతకంతో రాణించాడు.