టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్.. వచ్చే ఐపీఎల్లో దిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడనున్నాడు. శుక్రవారం అతడి బదిలీ ప్రక్రియ పూర్తయింది. అనంతరం ఈ విషయంపై మాట్లాడిన దిల్లీ ప్రధాన కోచ్ రికీ పాంటింగ్.. అశ్విన్‌పై ప్రశంసలు కురిపించాడు. తెలివైన బౌలింగ్‌తో ప్రభావం చూపుతాడని అన్నాడు.
స్పిన్నర్ అశ్విన్‌పై రికీ పాంటింగ్ ప్రశంసలు - Delhi Capitals coach Ricky Ponting praises Ravichandran Ashwin
ఐపీఎల్లో దిల్లీ క్యాపిటల్స్ జట్టులో కొత్తగా చేరిన స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌పై ప్రశంసలు కురిపించాడు ఆ జట్టు ప్రధాన కోచ్ రికీ పాంటింగ్. అశ్విన్ పెను ప్రభావం చూపగలడని అన్నాడు.
"అశ్విన్.. తాను ప్రాతినిధ్యం వహించే ప్రతి జట్టుకు విలువ చేకూరుస్తాడు. దిల్లీ క్యాపిటల్స్ జట్టులో చేరిన అతడికి ఎలాంటి మార్పు ఉండదు. మా సొంత మైదానం మందకొండిగా ఉంటుంది. స్పిన్నర్లకు సహకరిస్తుంది. అందులో ఎలాంటి సందేహం లేదు. ఆ పిచ్‌పై తన తెలివైన బౌలింగ్‌తో అశ్విన్ పెను ప్రభావం చూపగలడని భావిస్తున్నా" -రికీ పాంటింగ్, దిల్లీ ప్రధాన కోచ్
అశ్విన్.. ఇప్పటి వరకు 68 టెస్టుల్లో 357 వికెట్లు, 111 వన్డేల్లో 150 వికెట్లు తీశాడు. ఐపీఎల్‌లోనూ మంచి రికార్డు ఉంది. 139 మ్యాచుల్లో 6.79 ఎకానమీతో 125 వికెట్లు పడగొట్టాడు. చెన్నై సూపర్సింగ్స్ విజేతగా అవతరించిన 2010, 2011 సీజన్లలో ఆ జట్టులో కీలక పాత్ర పోషించాడు. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కెప్టెన్‌గా రెండేళ్లు ఉన్నా ఆ జట్టును ప్లేఆఫ్‌కు చేర్చడంలో విఫలమయ్యాడు.