తెలంగాణ

telangana

ETV Bharat / sports

మెరిసిన ధావన్, శ్రేయస్.. దిల్లీ విజయం - kings elavan punjab

కింగ్స్ ఎలెవన్ పంజాబ్​తో జరిగిన మ్యాచ్​లో దిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించింది. గేల్ మెరుపు ఇన్నింగ్స్ వృధా కాగా ధావన్, శ్రేయస్ అయ్యర్ అర్ధశతకాలతో మెరిశారు.

ఐపీఎల్

By

Published : Apr 21, 2019, 12:05 AM IST

దిల్లీ బ్యాట్స్​మెన్ రాణించిన వేళ పంజాబ్​పై శ్రేయస్ సేన విజయం సాధించింది. 164 పరుగుల లక్ష్యాన్ని కేవలం ఐదు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ధావన్ 41 బంతుల్లో 56 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. సారథి శ్రేయస్ అయ్యర్ కూడా హాఫ్ సెంచరీతో మెరిశాడు.

ఇన్నింగ్స్ 24 పరుగుల వద్ద పృథ్వీ షా ఔటైనా ధావన్, శ్రేయస్ అయ్యర్ మంచి భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. పంత్ విఫలమైనా కెప్టన్ శ్రేయస్ అయ్యర్ (58) ముందుండి జట్టును విజయ తీరాలకు చేర్చాడు.

పంజాబ్ బౌలర్లలో విల్జోయిన్ రెండు వికెట్లు దక్కించుకోగా.. షమి ఒక వికెట్ తీశాడు.

గేల్ మెరుపులు
టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన పంజబ్ గేల్ మెరుపులతో గౌరవప్రదమైన స్కోర్ సాధించింది. ప్రారంభంలోనే రాహుల్ (12) వికెట్ కోల్పోయినా గేల్ అర్ధశతకంతో రాణించాడు. 37 బంతుల్లోనే 5 సిక్సులు, 6 ఫోర్లతో 69 పరుగులు చేశాడు. మన్​దీప్ సింగ్ 30 పరుగులతో ఆకట్టుకున్నాడు. మిగతా బ్యాట్స్​మెన్స్​లో మయాంక్ అగర్వాల్ (2), మిల్లర్ (7), సామ్ కరన్ (0), అశ్విన్ (16), విఫలమయ్యారు.

దిల్లీ బౌలర్లలో సందీప్ లామిచానే 3 వికెట్లు తీయగా.. అక్షర్ పటేల్, రబాడ చెరో రెండు వికెట్లు దక్కించుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details