తెలంగాణ

telangana

ETV Bharat / sports

ధోనీ విఫలమైతే మాత్రం కష్టమే: జోన్స్ - ధోనీ గురించి జోన్స్

లాక్​డౌన్ కారణంగా ఇంతకాలం వాయిదా పడ్డ ఐపీఎల్​కు ఎట్టకేలకు ముహూర్తం కుదిరింది. సెప్టెంబర్ 19 నుంచి ఈ లీగ్ నిర్వహించనున్నారు. అయితే ఇప్పుడు దృష్టంతా ధోనీమీదే పడింది. తాజాగా ఈ విషయమై ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ డీన్ జోన్స్ స్పందించారు.

ధోనీ విఫలమైతే మాత్రం కష్టమే: జోన్స్
ధోనీ విఫలమైతే మాత్రం కష్టమే: జోన్స్

By

Published : Jul 25, 2020, 3:28 PM IST

లాక్‌డౌన్‌ కారణంగా నిరవధికంగా వాయిదా పడిన ఐపీఎల్‌ 13వ సీజన్‌పై స్పష్టత రావడం వల్ల అందరి కళ్లూ ఇప్పుడు చెన్నై సూపర్‌ కింగ్స్‌ సారథి మహేంద్రసింగ్‌ ధోనీపై పడ్డాయి. గతేడాది వన్డే ప్రపంచకప్‌ తర్వాత క్రికెట్‌కు దూరమైన ధోనీపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ ఐపీఎల్‌లో రాణించి మళ్లీ జాతీయ జట్టులోకి వస్తాడని ఆశగా వేచి చూస్తున్నారు. ఇదే విషయంపై ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్‌ డీన్‌జోన్స్‌ తాజాగా స్పందించారు.

ధోనీ

"ప్రస్తుత పరిస్థితుల్లో భారత జట్టు సెలక్టర్లు రిషభ్‌ పంత్‌, కేఎల్‌ రాహుల్‌ వైపే మొగ్గు చూపుతున్నారు. ఒకవేళ ధోనీ ఈ ఐపీఎల్‌లో చెలరేగితే అతడి పునరాగమనానికి అవకాశాలు ఉన్నాయి. కానీ, అతడు విఫలమైతే మాత్రం కచ్చితంగా టీమ్‌ఇండియా తలుపులు మూసుకుపోతాయి. ఇప్పటికైతే మహీకి అవకాశం ఉంది. ఈ విరామం కూడా అతడికి అద్భుతంగా కలిసిరావొచ్చు. దీంతో మంచి విశ్రాంతి దొరికింది. అయితే, ఒక విషయం మాత్రం కచ్చితంగా చెప్పగలను. వయసు పెరిగే కొద్దీ ఒక ఆటగాడు విరామం తీసుకొని మళ్లీ రాణించడం చాలా కష్టం."

-డీన్ జోన్స్‌, ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్

ఏడాది పాటు ఆటకు దూరమైన ధోనీ మార్చిలో చెన్నై సూపర్‌ కింగ్స్‌ నిర్వహించిన శిక్షణా శిబిరంలో సాధన చేశాడు. అక్కడ ఎంతో కష్టపడ్డాడని తోటి ఆటగాళ్లు, ఇటీవల సామాజిక మాధ్యమాల్లో వెల్లడించారు. ఇప్పుడు ఐపీఎల్‌ తేదీలు ఖరారవడం వల్ల ఈసారి అతడు చెలరేగిపోతాడని అభిమానులు ఆశిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details