తెలంగాణ

telangana

ETV Bharat / sports

టీ20 చరిత్రలో సరికొత్త రికార్డు.. టాప్​లో మలన్​ - ICC rankings

టీ20ల్లో ఎక్కువ రేటింగ్ పాయింట్లు తెచ్చుకున్న తొలి బ్యాట్స్​మన్​గా డేవిడ్ మలన్ ఘనత సాధించాడు. భారత్​ క్రికెటర్లు కేఎల్ రాహుల్, కోహ్లీ.. టాప్​-10లో స్థానం సంపాదించుకున్నారు.

dawid malan
ఎక్కువ రేటింగ్ పాయింట్స్​తో రికార్డు సృష్టించిన మలన్

By

Published : Dec 2, 2020, 4:00 PM IST

ఐసీసీ టీ20 పురుషుల​ ర్యాంకింగ్స్​లో ఇంగ్లాండ్​ ఆటగాడు డేవిడ్ మలన్ సరికొత్త రికార్డు సృష్టించాడు. దక్షిణాఫ్రికాతో సిరీస్​లో ఉత్తమ ప్రదర్శన కనబరిచి​ 915 పాయింట్లు సాధించాడు. దీంతో టీ20 చరిత్రలోనే ఎక్కువ రేటింగ్​ పాయింట్స్​ సంపాదించిన తొలి బ్యాట్స్​మన్​గా నిలిచాడు.

ఈ ఘనతతో మలన్​, గతేడాది టీ20​ల్లో టాప్​లో నిలిచిన ఆస్ట్రేలియా క్రికెటర్ అరోన్ ఫించ్​(900 పాయింట్లు) అధిగమించాడు. ఈ ఏడాది జాబితాలో రెండో స్థానంలో​ ఉన్న బాబర్ అజమ్​ కన్నా మలన్​కు 44 పాయింట్లు ఎక్కువ ఉండటం విశేషం.

ఐసీసీ బుధవారం వెల్లడించిన ఈ ర్యాంకింగ్స్​లో భారత​ బ్యాట్స్​మెన్ కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ టాప్-10లో చోటు దక్కించుకున్నారు. రాహుల్​కు నాలుగో స్థానం దక్కగా కోహ్లీ తొమ్మిదిలో నిలిచాడు. దక్షిణాఫ్రికాతో సిరీస్​ గెలుచుకున్న తర్వాత టీ20ల్లో టాప్​ అగ్రస్థానానికి చేరుకుంది ఇంగ్లాండ్.

ఇదీ చదవండి:మలన్-బట్లర్ రికార్డు- ఇంగ్లాండ్​దే టీ20 సిరీస్​

ABOUT THE AUTHOR

...view details