డేవిడ్ వార్నర్ ఆస్ట్రేలియా క్రికెటర్ అయినప్పటికీ.. ఐపీఎల్ ద్వారా భారత క్రికెట్ అభిమానులకు చాలా దగ్గర అయిపోయాడు. అయితే అతడి రెండో కుమార్తె ఇండీ మాత్రం టీమ్ఇండియా కెప్టెన్ కోహ్లీకి వీరాభిమాని.
ట్రిపుల్ ఎమ్ సిడ్నీ 104.9 ఎఫ్ఎమ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వార్నర్ భార్య క్యాండీస్ ఈ విషయాన్ని వెల్లడించింది. సదరు ఎఫ్ఎమ్ తన వీడియోను ట్వీట్ చేయగా, సారీ వార్నర్ అంటూ ఈమె రీట్వీట్ చేసింది.