ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ తన అభిమానులను సోషల్ మీడియాలో అలరిస్తుంటాడు. తన ఇన్‌స్టాగ్రామ్‌లో తాజాగా ఓ వీడియోను షేర్ చేశాడు. ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడుతున్న వార్నర్ ఓ వాణిజ్య ప్రకటనకు గానూ బ్యాట్‌ను కత్తిలాగా తిప్పుతూ అందులో కనిపించాడు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు జడేజాను గుర్తుచేశాడంటూ కామెంట్లు పెడుతున్నారు.
డేవిడ్ వార్నర్ ప్రస్తుతం స్వీయనిర్బంధంలో ఉన్నాడు. ఈ ఏడాది ప్రారంభం నుంచి మంచి ఫామ్‌లో కొనసాగుతున్నాడు. ముంబయిలోని వాంఖడే స్టేడియంలో జరిగిన వన్డే మ్యాచ్‌లో భారత్‌పై 128 పరుగులు చేసి అలరించాడు. స్వదేశంలో ఆసీస్‌పై జరిగిన ఆ మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-1 తేడాతో భారత్ కైవసం చేసుకుంది. ఇతర క్రికెటర్ల మాదిరిగానే వార్నర్ క్రికెట్ మైదానంలోకి తిరిగి రావడానికి ఎంతగానో ఎదురుచూస్తున్నాడు. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లోనూ వార్నర్.. సన్‌రైజర్స్ హైదరబాద్ జట్టులోనే ఉంటాడని ఇటీవలే యాజమాన్యం ప్రకటించింది.