సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్ బ్యాట్స్‌మన్ డేవిడ్ వార్నర్.. ఐపీఎల్లో తన ఆల్‌టైమ్ జట్టును చెప్పాడు. ప్రముఖ కామెంటేటర్ హర్ష భోగ్లేతో జరిగిన లైవ్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ విషయం తెలిపాడు. అయితే ఇందులో భారత్‌కు చెందిన ఎనిమిది మంది క్రికెటర్లు ఉండగా, యువరాజ్ సింగ్‌కు చోటు దక్కలేదు.
వార్నర్ 'ఐపీఎల్ జట్టు'లో యువరాజ్‌కు దక్కని చోటు
తన 'ఆల్‌టైమ్ ఐపీఎల్ ఎలెవన్'ను వెల్లడించాడు ఆసీస్ స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్. ఇందులో యువరాజ్ సింగ్‌కు చోటు దక్కలేదు.
ఆసీస్ స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్
ఈ జట్టులో రోహిత్ శర్మ, తాను ఓపెనర్లు అని చెప్పిన వార్నర్.. మూడో స్థానంలో కోహ్లీ, నాలుగు-ఐదు-ఆరులో వరుసగా రైనా, హార్దిక్ పాండ్య, మ్యాక్స్‌వెల్‌కు స్థానం కల్పించాడు. ఏడో స్థానంతో పాటు వికెట్ కీపర్‌గా ధోనీ ఎంచుకున్నాడు. ఆ తర్వాత స్టార్క్(8), నెహ్రా(9), బుమ్రా(10), కుల్దీప్/చాహల్(11)లకు చోటిచ్చాడు.
Last Updated : May 7, 2020, 3:16 PM IST