దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్ డేల్ స్టెయిన్ ట్విట్టర్లో తాజాగా అభిమానులతో ముచ్చటించాడు. వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పాడు. ఈ సందర్భంగా తాను ఎదుర్కొన్న అత్యుత్తమ బ్యాట్స్మెన్ ఎవరో చెప్పాడు.
"మీరు బౌలింగ్ చేసిన బ్యాట్స్మెన్లలో ఉత్తమ ఆటగాడు ఎవరు?" అని ఓ అభిమాని అడిగాడు. డేల్ స్టెయిన్ దానికి స్పందిస్తూ.. "పాంటింగ్ అత్యుత్తమ ఆటగాడు, సచిన్ గోడ మాదిరి క్రీజులో నిలబడతాడు. ద్రవిడ్, గేల్, పీటర్సన్ బాగా ఆడతారు" అంటూ సమాధానమిచ్చాడు.