ప్రస్తుతం భారత పేసర్లు గొప్పగా బౌలింగ్ చేస్తున్నారని అన్నాడు దిగ్గజ క్రికెటర్ కపిల్ దేవ్. ఇప్పటి ఫాస్ట్ బౌలర్లు, పేస్ విభాగంలో బలమైన మార్పు తీసుకొచ్చారని చెప్పాడు. వీరి రాకతో భారత క్రికెట్ రూపు మారిపోయిందని తెలిపాడు.
"జస్ప్రీత్ బుమ్రా, ఉమేశ్ యాదవ్, షమి, ఇషాంత్ శర్మ, దీపక్ చాహర్, నవదీప్ సైనీలతో భారత పేస్ దళం బలంగా ఉంది. గాయం కారణంగా దక్షిణాఫ్రికాతో సిరీస్కు బుమ్రా దూరమయ్యాడు. అయినప్పటికీ షమి.. అద్భుత ప్రదర్శనతో జట్టును గెలిపించాడు. టాప్-10 బౌలర్లలో ఉండటం గొప్ప కాదు. జట్టుకు ఎంతగా ఉపయోగపడ్డామన్నదే ముఖ్యం. సఫారీలతో జరిగిన తొలి టెస్టులో షమి బౌలింగ్ అందుకు ఉదాహరణ" -కపిల్ దేవ్, టీమిండియా మాజీ క్రికెటర్
యువ పేసర్లను గుర్తించేందుకు ఐపీఎల్ ఎంతగానో ఉపయోగపడుతుందని కపిల్ చెప్పాడు.