తెలంగాణ

telangana

ETV Bharat / sports

వైరల్: ధోనీ వీడ్కోలుపై సీఎస్​కే ట్వీట్ - retirement

ధోనీ రిటైర్మెంట్​పై స్పష్టత వచ్చిన నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ పెట్టిన పోస్టు నెట్టింట వైరల్ అయింది. గేమ్​ ఆఫ్ థ్రోన్స్​ చివరి సీజన్​లో పాపులరైన 'నాట్ టుడే' డైలాగ్​తో పోస్టును షేర్ చేసింది సీఎస్​కే.

ధోని

By

Published : Sep 13, 2019, 7:10 PM IST

Updated : Sep 30, 2019, 12:00 PM IST

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ రిటైర్మెంట్ పలుకుతున్నాడంటూ గురువారం వార్తలు షికారు చేశాయి. అయితే అవన్నీ పుకార్లే అని తర్వాత తేలింది. ఈ అంశంపై చెన్నై సూపర్ కింగ్స్ చేసిన పోస్టు వైరల్ అయింది. ప్రముఖ అమెరికన్ టెలివిజన్ సిరీస్ 'గేమ్ ఆఫ్ థ్రోన్స్'​లో పాపులర్ డైలాగ్ 'నాట్ టుడే' పేరుతో పోస్ట్ చేసింది సీఎస్​కే. దీనిపై సామాజిక మాధ్యమాల్లో ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు.

ఈ ఏడాది విడుదలైన 'గేమ్ ఆఫ్ థ్రోన్స్' చివరి సీజన్​లో ఆర్య స్టార్క్ చెప్పిన 'నాట్ టుడే' డైలాగ్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇప్పుడు అదే రీతిలో ధోనీ జెర్సీ 7ను 'నాట్ టుడే' పదంలోని ఆంగ్ల అక్షరం టీ స్థానంలో ఉంచి పోస్టు పెట్టింది సీఎస్​కే.

ఇదీ చదవండి: పీవీ సింధును ఘనంగా సన్మానించిన ఏపీ ప్రభుత్వం

Last Updated : Sep 30, 2019, 12:00 PM IST

ABOUT THE AUTHOR

...view details