చెన్నై సూపర్‌కింగ్స్‌కు వరుస షాకులు తగులుతున్నాయి. తాజాగా మరో ఆటగాడికి కరోనా వైరస్ సోకిందని సమాచారం. శుక్రవారం చేసిన ఆర్‌టీ పీసీఆర్ పరీక్షల్లో అతడికి పాజిటివ్‌గా ధ్రువీకరణ అయినట్లు తెలుస్తోంది. దీంతో ఆ ఫ్రాంచైజీలో కొవిడ్-19 బాధితుల సంఖ్య మొత్తంగా 13కు చేరింది. ఒకే బృందంలో అంతమందికి వైరస్ సోకిందంటే పరిస్థితి కష్టమేనని అనిపిస్తోంది.
ప్రస్తుతం వైరస్ సోకిన ఆటగాడు ఈ మధ్యే భారత్-ఏకు ఎంపికయ్యాడని, టాపార్డర్‌లో ఆడతాడని, రంజీల్లో పరుగుల వరద పారించాడని సమాచారం. దాంతో మహారాష్ట్ర యువ క్రికెటర్ రుత్‌రాజ్ గైక్వాడ్ పైనే అనుమానాలు నెలకొన్నాయి. 2018-19 సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో రుతురాజ్ సత్తాచాటాడు. మహారాష్ట్ర తరఫున అత్యధిక పరుగుల వీరుడిగా నిలిచాడు. అందుకే 2019 వేలంలో అతడిని చెన్నై కొనుగోలు చేసింది.