తెలంగాణ

telangana

ETV Bharat / sports

శ్రీలంక ఉగ్రదాడిపై క్రికెట్​ సమాజం ఆగ్రహం

ఆదివారం శ్రీలంకలో జరిగిన వరుస ఉగ్రదాడులు వందల మంది ప్రాణాలను బలిగొన్నాయి. చాలా కుటుంబాల్లో ఆవేదన నింపాయి. వందల మందికి పైగా గాయాలపాలయ్యారు. ఈ ఘటనపై క్రికెట్​ సమాజం ఆగ్రహం వ్యక్తం చేసింది.

శ్రీలంకలో ఉగ్రదాడిపై క్రికెట్​ సమాజం ఆగ్రహం

By

Published : Apr 21, 2019, 7:46 PM IST

శ్రీలంకలో పెద్ద స్థాయిలో బాంబు పేలుళ్లు సంభవించాయి. ఈస్టర్​ పండుగ సందర్భంగా చర్చిలకు వెళ్తారనే పక్కా ప్రణాళికతో దాడులు చేశాయి ఉగ్రమూకలు. ఈ ఘటనతో యావత్​ ప్రపంచం నివ్వెరపోయింది. దేశంతో సంబంధం లేకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెటర్లు ఘటనను ముక్తకంఠంతో ఖండించారు. శ్రీలంక మాజీ ఆటగాళ్లు బాధిత కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు. భారత క్రికెటర్లు సచిన్, రోహిత్​, విరాట్​, లక్ష్మణ్​, రైనా శ్రీలంకలో శాంతి నెలకొనాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details