ఉత్తరప్రదేశ్ కాన్పూర్‌లో క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడుతున్న ముఠాను అరెస్ట్ చేశారు పోలీసులు. వారి దగ్గర నుంచి క్యాష్ కౌంటింగ్ యంత్రం, 11 మొబైల్స్, ఒక ల్యాప్‌టాప్‌తో పాటు 93 లక్షల నగదులు స్వాధీనం చేసుకున్నారు.
క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టురట్టు.. ఆరుగురి అరెస్ట్ - క్రికెట్ బెట్టింగ్ వార్తలు
ఉత్తరప్రదేశ్ కాన్పూర్‌లో క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడుతున్న ముఠాను అరెస్ట్ చేశారు పోలీసులు. ఐపీఎల్ ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో జరిపిన తనిఖీల్లో ఈ ముఠాను పట్టుకున్నారు.
క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టురట్టు.. ఆరుగురి అరెస్ట్
"ఈ గ్యాంగ్ వాట్సప్ ద్వారా బెట్టింగ్‌లకు పాల్పడుతోంది. మ్యాచ్ అయిపోయాక నగదు లావాదేవీలను జరుపుతున్నారు. కాన్పూర్‌లోని మొత్తం ఐదు స్థానాల్లో తనిఖీలు చేశాం. నిందితుల నుంచి నేపాలీ కరెన్సీ కూడా లభించింది" అని కాన్పూర్ డీఐజీ ప్రీతిందర్ సింగ్ తెలిపారు.
ఐపీఎల్ మరో వారం రోజుల్లో ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో బెట్టింగ్ ముఠాలు జోరుగా కార్యకలాపాలు సాగిస్తున్నాయి. ఈ క్రమంలోనే పోలీసులు వీరిపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు.