ఆస్ట్రేలియాలో టీమ్‌ఇండియా పర్యటనపై నెలకొన్న అనిశ్చితికి తెరపడింది. టెస్టు సిరీస్ యథాతథంగా జరుగుతుందని ప్రకటించిన క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) బుధవారం బోర్డర్- గావస్కర్ ట్రోఫీ షెడ్యూల్‌ను విడుదల చేసింది. నవంబరులో టీమ్‌ఇండియా కంగారు గడ్డ మీద అడుగుపెడుతుంది. డిసెంబరు 3 నుంచి 7 వరకు బ్రిస్బేన్‌లో తొలి టెస్టు జరుగుతుంది. 1988 నుంచి ఇప్పటివరకు గబ్బా స్టేడియంలో ఆతిథ్య జట్టుకు ఓటమే లేదు.
ఆసీస్ పర్యటన యథాతథం.. అడిలైడ్‌లోనే గులాబీ టెస్టు - క్రికెట్ ఆస్ట్రేలియా న్యూస్
ఆస్ట్రేలియా, భారత్ మధ్య ఈ ఏడాది చివర్లో జరగనున్న బోర్డర్-గావస్కర్ ట్రోఫీ షెడ్యూల్‌ను బుధవారం విడుదల చేసింది క్రికెట్ ఆస్ట్రేలియా. నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్.. డిసెంబరు 3 నుంచి జనవరి 7 వరకు జరగనుంది.
ఆసీస్, భారత్ టెస్టు సిరీస్ షెడ్యూల్ విడుదల
డిసెంబరు 11 నుంచి 15 వరకు అడిలైడ్‌లో రెండో మ్యాచ్ నిర్వహిస్తారు. ఇది డేనైట్ టెస్టు. టీమ్‌ఇండియా, ఆసీస్‌ల మధ్య తొలి గులాబి బంతి మ్యాచ్ ఇదే. డిసెంబరు 26 నుంచి 30 మెల్‌బోర్న్‌లో బాక్సింగ్ డే టెస్టు.. జనవరి 3 నుంచి 7 వరకు సిడ్నీలో నాలుగో మ్యాచ్ జరుగుతాయి. 2018-19లో విరాట్ కోహ్లి సారథ్యంలోని టీమ్‌ఇండియా తొలిసారిగా ఆసీస్ గడ్డపై టెస్టు సిరీస్ నెగ్గి 71 ఏళ్ల నిరీక్షణకు తెరదించింది.
ఇదీ చూడండి... నేడే ఐసీసీ సమావేశం.. టీ20 ప్రపంచకప్‌పై తుది నిర్ణయం
Last Updated : May 28, 2020, 8:06 AM IST