కరోనా వైరస్‌కు వ్యతిరేకంగా నిరంతరం పోరాడుతున్న వారికి మద్దతుగా గుండు చేసుకున్నాడు ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్. ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నాడు. ఈ ఛాలెంజ్‌ను స్వీకరించాలని ఆసీస్ ఆటగాళ్లు స్టీవ్ స్మిత్, పాట్ కమిన్స్, జో బర్న్స్, ట్రవిస్ స్మిత్, పీర్స్ మోర్గాన్, ఆడం జంపా, మార్కస్ స్టోయినిస్, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీలను కోరాడు.
కరోనాపై పోరుకు మద్దతుగా కోహ్లీ గుండు!
కరోనా వైరస్‌పై పోరాడుతున్న వారికి మద్దతుగా నిలిచాడు ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్. తనకు తాను గుండు చేసుకొని వారికి సంఘీభావం తెలిపాడు. ఈ ఛాలెంజ్ స్వీకరించాలని స్టీవ్ స్మిత్, విరాట్ కోహ్లీలతో పాటు మరికొంత మందిని కోరాడు.
కరోనాపై పోరుకు మద్దతుగా కోహ్లీ గుండు!
"కొవిడ్-19కు వ్యతిరేకంగా పోరాడే వారికి నా మద్దతు తెలుపుతున్నా. దానికి గుర్తుగా నా తలపై ఉన్న వెంట్రుకలను ట్రిమ్ చేసుకున్నా. ఈ ఛాలెంజ్‌ను నేనే ప్రారంభించా" అని తెలిపాడు వార్నర్. కరోనా వైరస్ వల్ల ఆస్ట్రేలియాలో ఇప్పటివరకు 19 మంది మరణించగా.. 4,514 మంది ఈ మహమ్మారి బారిన పడ్డారు.
ఇదీ చూడండి.. రోహిత్ తనకు ఆదర్శమంటోన్న పాక్ క్రికెటర్
Last Updated : Mar 31, 2020, 11:44 AM IST