ఏప్రిల్ 12 నుంచి జరగాల్సిన కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో మొదటి ఆరు మ్యాచ్‌లకు గ్లోస్టర్షైర్తో టీమ్ఇండియా టెస్టు స్పెషలిస్టు చెతేశ్వర్ పుజారా ఒప్పందం కుదుర్చుకున్నాడు. అయితే ప్రపంచవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తున్న కరోనా కారణంగా ఈ టోర్నీని రద్దు చేశారు.
ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్న సంక్షోభం కారణంగా ఈ ఒప్పందం ముగిసిందని గ్లోస్టర్షైర్ గురువారం తెలిపింది. మే 28 వరకు జరగాల్సిన అన్ని క్రికెట్ టోర్నీలను రద్దు చేస్తున్నట్టు తాజాగా ఇంగ్లాండ్, వేల్స్ క్రికెట్ బోర్డు ప్రకటించటమే అందుకు కారణం.
"ఈ ఏడాది చెతేశ్వర్ పుజారా ఆటను చూసే అవకాశాన్ని మేము కోల్పోయాం. కరోనా కారణంగా మే నెల చివరి వరకు ఎలాంటి టోర్నీలు నిర్వహించడం లేదు. ఈ పరిణామాలతో ప్రతి ఒక్కరు తీవ్రంగా నిరాశ చెందుతారని తెలుసు."