తెలంగాణ

telangana

ETV Bharat / sports

'కరోనా అయితే ఏంటి.. కరచాలనం చేస్తాం' - Coronavirus: Australian Cricketers Stick With Handshakes Despite Threat

కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోంది. ఈ వైరస్ దెబ్బకు ఆటగాళ్లు కరచాలనం ఇవ్వడమే మానేస్తున్నారు. అయితే ఆస్ట్రేలియా ఆటగాళ్లు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నారు.

ఆసీస్
ఆసీస్

By

Published : Mar 9, 2020, 6:38 PM IST

ఆస్ట్రేలియా క్రికెటర్లకు కరోనా అంటే భయం లేనట్టుంది. అందుకే కరచాలనం కొనసాగిస్తామని అంటున్నారు. తమ వద్ద శానిటైజర్స్​ కావల్సినన్ని ఉన్నాయని.. షేక్ హ్యాండ్ వల్ల ఎటువంటి ఇబ్బంది లేదని ఆసీస్ కోచ్ లాంగర్ తెలిపాడు. శుక్రవారం నుంచి న్యూజిలాండ్​తో వన్డే సిరీస్ సందర్భంగా మాట్లాడాడు లాంగర్.

"డ్రెస్సింగ్​ రూమ్​తో పాటు ఆటగాళ్ల మధ్య పలకరింపులో ఎలాంటి తేడా ఉండదు. కరచాలనం కొనసాగిస్తాం. ఆటగాళ్ల వద్ద సరిపడా శానిటైజర్​లు ఉన్నాయి."

-జస్టిన్ లాంగర్, ఆసీస్ కోచ్

అయితే ఇంగ్లాండ్ మాత్రం కరచాలనానికి స్వస్తి చెప్పింది. ఆరోగ్య పరంగా చాలా జాగ్రత్తగా ఉంటామని.. అందుకే కరచాలనానికి బదులు ఫిస్ట్ బంప్​ను కొనసాగిస్తామని తెలిపింది.

ABOUT THE AUTHOR

...view details