న్యూజిలాండ్ యువ క్రికెటర్ కోరె అండర్సన్.. 29 ఏళ్లకే అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. అమెరికాలోని మేజర్ క్రికెట్ లీగ్‌లో ఆడేందుకు మూడేళ్ల ఒప్పందం కుదుర్చుకున్న నేపథ్యంలోనే వీడ్కోలు నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించాడు. అలాగే కివీస్ జట్టు తరఫున ఆడినందుకు ఎంతో గర్వంగా ఉందని చెప్పాడు. అన్ని ఫార్మాట్లలో కలిపి.. ఈ ఆల్‌రౌండర్ 93 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాడు.
కివీస్ క్రికెటర్ అండర్సన్ రిటైర్మెంట్ - అమెరికా మేజర్ క్రికెట్ లీగ్
న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ కోరె అండర్సన్.. యుక్త వయసులోనే అంతర్జాతీయ కెరీర్‌కు ముగింపు పలికాడు. అమెరికన్ లీగ్‌లో పాల్గొనేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పాడు.
"ఇది అంత సులువైన నిర్ణయం కాదు. నాకు నేను ఎన్నో ప్రశ్నలు వేసుకున్నా. రానున్న రెండు, ఐదేళ్లు, పదేళ్లలో ఏం చేయాలా అని ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నా. ఈ విషయంలో నా భార్య మేరీ మార్గరెట్ పాత్ర కూడా ఎంతో ఉంది. నా కోసం అమెరికా నుంచి న్యూజిలాండ్ వచ్చి జీవించింది. ప్రతి క్షణం నా వెన్నంటే ఉంది. అందుకే ఆమె కోసం, జీవితంలో మార్పు కోసం అమెరికా వెళ్లాలని భావించా" అని అండర్సన్ చెప్పాడు.
వన్డేల్లో అత్యంత వేగవంతమైన సెంచరీ(2013లో వెస్టిండీస్‌పై) చేసిన జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు అండర్సన్. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ముంబయి ఇండియన్స్‌కు ఆడాడు. తర్వాత ఫామ్ లేమి కారణంగా జాతీయ జట్టులో చోటు కోల్పోయాడు. చివరి వన్డే 2017 జూన్‌లో బంగ్లాదేశ్‌పై, చివరి టీ20 2018లో పాకిస్థాన్‌పై ఆడాడు.