తెలంగాణ

telangana

ETV Bharat / sports

'ధావన్​, భువి ఔట్​​' - బీసీసీఐ కాంట్రాక్టులు

2018-19 సంవత్సరానికి భారత క్రికెట్​ ఆటగాళ్ల కాంట్రాక్టుల వివరాలు విడుదల చేసింది బీసీసీఐ. ధావన్​, భువీలను ఏ ప్లస్​ కేటగిరీ నుంచి తప్పించింది.

'ఏ ప్లస్​ నుంచి ధావన్​, భువి ఔట్​​'

By

Published : Mar 8, 2019, 3:11 PM IST

భారత సీనియర్​ ఆటగాళ్లు ధావన్, భువనేశ్వర్​ కుమార్​లను​ ఏ ప్లస్​ కేటగిరీ నుంచి తొలగించింది భారత క్రికెట్​ నియంత్రణ మండలి(బీసీసీఐ). ఫలితంగా వీరికి అందజేసే వార్షిక ఆదాయం తగ్గనుంది. యువ క్రీడాకారుడు పంత్ ఏ కేటగిరిలో స్థానం సంపాదించాడు. అత్యధిక ఆదాయం వచ్చే ఏ ప్లస్​ విభాగంలో ప్రస్తుతం ముగ్గురు క్రికెటర్లు మాత్రమే ఉన్నారు.

  • ఇటీవల ధావన్​, భువీ ఫామ్​ను పరిగణనలోకి తీసుకున్న బీసీసీఐ వీరి స్థాయి తగ్గించింది. ఏ కేటగిరీలోకి మారుస్తూ గురువారం నిర్ణయం వెల్లడించింది. దీని వల్ల వీరి వార్షిక జీతం రూ. 7కోట్ల నుంచి ఐదు కోట్లకు పడిపోనుంది.

ముగ్గురు మొనగాళ్లు:
ప్రస్తుతం ఏ ప్లస్​ కేటగిరిలో భారత సారథి విరాట్​ కోహ్లీ, రోహిత్​ శర్మ, బుమ్రా మాత్రమే ఉన్నారు.

ఏ ప్లస్​ కేటగిరీలో బుమ్రా, కోహ్లీ

పంత్ పై పైకి​...
యువ ఆటగాడు రిషబ్​ పంత్​... ఈ ఏడాది కాంట్రాక్టులో ఏ కేటగిరీని సొంతం చేసుకున్నాడు. ఐదు కోట్ల వార్షిక ఆదాయం లభించనుంది. ధోని పరిమిత ఓవర్ల క్రికెట్​కు వీడ్కోలు పలికితే ఇతడే కీలకమయ్యే నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. ఇటీవల ఇంగ్లండ్​, ఆస్ట్రేలియా పర్యటనలలో మెరుగైన ఆటతీరుతో మెప్పించాడు పంత్​.

ఏ కేటగిరీలో మరికొందరు:
ఈ విభాగంలో ధోని, ధావన్​, భువనేశ్వర్​, షమి, అశ్విన్​, ఇషాంత్​ శర్మ, జడేజా, కుల్​దీప్​ యాదవ్​​, పుజారా, రహానే ఉన్నారు.
చైనామన్​ స్పిన్నర్​ కుల్​దీప్​​ బీ కేటగిరీ నుంచి ఏ కేటగిరీకి అప్​గ్రేడ్​ అయ్యాడు. ఆసీస్​ టూర్​లో విఫలమైన ఓపెనర్​ మురళీ విజయ్​ని పూర్తిగా ఈ జాబితా నుంచి తొలగించారు.

  • పుజారా టెస్టు ఫార్మాట్​లో మాత్రమే ఆడుతూ ఏ కేటగిరీలో కొనసాగుతున్నాడు.

బీ కేటగిరీలో...
ఆల్​రౌండర్​ హార్దిక్​ పాండ్య, కేఎల్​ రాహుల్​ బీ కేటగిరీలో ఉన్నారు. వీరికి 3 కోట్ల వార్షిక ఆదాయం లభిస్తుంది. వీరితో పాటు చాహల్​, ఉమేశ్​ ఇదే విభాగంలో ఉన్నారు.

కేట'గిరి' గీసి...
సుప్రీం కోర్టు ఏర్పాటు చేసిన బీసీసీఐ పాలకుల కమిటీ సూచనల మేరకు భారత సీనియర్ జట్టులో ఏ+, ఏ, బీ, సీ కేటగిరీలు ఉంటాయి. ఈ విభాగాల ఆధారంగానే క్రీడాకారులకు చెల్లింపులు చేస్తున్నారు.
ఏ+ కేటగిరీలో చోటు దక్కించుకున్న ఆటగాళ్లకు ఏటా రూ.7 కోట్లు, కేటగిరీ-ఏ క్రీడాకారులకు రూ. 5 కోట్ల వేతనం అందిస్తారు. బీ-కేటగిరీలో ప్లేయర్లకు రూ.3 కోట్లు, సీ- కేటగిరీలో ఉన్న వారికి రూ.1 కోటి చొప్పున చెల్లిస్తున్నారు.

మహిళలకు...
ఏ-గ్రేడ్ మహిళా ప్లేయర్లకు రూ. 50 లక్షలు, బీ-గ్రేడ్​లో ఉన్న వారికి రూ.30 లక్షలు, సీ-గ్రేడ్ ప్లేయర్లకు రూ. 10 లక్షల చొప్పున వార్షిక వేతనం అందిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details