దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్‌లో సత్తాచాటి సిరీస్ విజయంలో కీలక పాత్ర పోషించాడు టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ. కెప్టెన్ విరాట్ కోహ్లీ, కోచ్ రవిశాస్త్రి వల్లే ఈ ప్రదర్శన సాధ్యమైందని, టెస్టుల్లోనూ ఓపెనింగ్ చేయగలనని వాళ్లు గుర్తించారని తెలిపాడు.
"కెప్టెన్ కోహ్లీ, కోచ్ రవిశాస్త్రి నాకు మద్దతుగా నిలిచారు. టెస్టుల్లో ఓపెనింగ్ చేసే అవకాశాన్నిచ్చిన జట్టు యాజమాన్యానికి కృతజ్ఞతలు. వన్డేల్లో 2013 నుంచి ఓపెనర్‌గా రావడం ప్రారంభించా. టెస్టుల్లో రాణించాలంటే క్రమశిక్షణ అవసరం. ఈ కారణంగానే ఈ రోజు ఇలా ఆడగలుగుతున్నా" - రోహిత్ శర్మ, టీమిండియా ఓపెనర్