తెలంగాణ

telangana

ETV Bharat / sports

రెచ్చిపోయిన​ గేల్​.. 22 బంతుల్లోనే 84 పరుగులు

అబుదాబి వేదికగా జరుగుతున్న టీ10 లీగ్​లో వెస్టిండీస్​ స్టార్​ బ్యాట్స్​మన్​ క్రిస్​ గేల్​ రెచ్చిపోయాడు. కేవలం 22 బంతుల్లోనే 84 పరుగులు చేసి బౌలర్లకు చుక్కలు చూపించాడు. అబుదాది జట్టు తరఫున ఆడుతున్న క్రిస్​.. మరాఠా టీమ్​తో జరిగిన మ్యాచ్​లో 12 బంతుల్లోనే అర్థ శతకం సాధించాడు.

Chris Gayle in Abudabi
రెచ్చిపోయిన​ గేల్​.. 22 బంతుల్లోనే 84 పరుగులు

By

Published : Feb 4, 2021, 2:42 PM IST

వెస్టిండీస్‌ స్టార్‌ బ్యాట్స్‌మన్‌ క్రిస్‌గేల్‌ చాలా రోజుల తర్వాత బ్యాట్‌ ఝుళిపించాడు. అబుదాబి వేదికగా జరుగుతున్న టీ10 లీగ్‌లో టీమ్‌ అబుదాబి తరఫున ఆడుతున్న అతడు గతరాత్రి.. మరాఠా అరేబియన్స్‌కు చుక్కలు చూపించాడు. 22 బంతుల్లో 84 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. దీంతో ప్రత్యర్థి నిర్దేశించిన 98 పరుగుల లక్ష్యాన్ని అబుదాబి 5.3 ఓవర్లలోనే ఛేదించింది.

తొలుత టాస్‌ ఓడి బ్యాటింగ్‌ చేసిన మరాఠా జట్టు నిర్ణీత 10 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 97 పరుగులు చేసింది. ఓపెనర్‌ అలిషన్‌ షరాఫు(33; 23 బంతుల్లో 2x4, 3x6) టాప్‌స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన అబుదాబి జట్టును గేల్(84 నాటౌట్‌; 22 బంతుల్లో 6x4, 9x6) సునాయాసంగా గెలిపించాడు. తొలి ఓవర్‌ నుంచే ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించాడు. వారిపై కనికరం చూపలేదు. బ్యాటింగ్‌ చేసి 12 బంతుల్లోనే అర్ధశతకం సాధించాడు.

కొడితే బంతి బౌండరీ లేదా సిక్స్‌ అన్నట్లుగా సాగింది క్రిస్‌గేల్‌ విధ్వంసం. మొత్తం 84 పరుగుల్లో 78 పరుగులు బౌండరీల రూపంలోనే వచ్చాయంటే అతడి ఇన్నింగ్స్‌ ఎలా సాగిందో అర్థం చేసుకోవచ్చు. మరో ఓవెనర్‌ పాల్‌ స్టిర్లింగ్‌ (11) విఫలమైనా.. జోక్లార్క్‌(5 నాటౌట్‌)తో కలిసి గేల్‌ తన జట్టును విజయ తీరాలకు చేర్చాడు. దీంతో వయసు పెరుగుతున్నా ఇంకా తనలో బ్యాటింగ్‌ చేసే సత్తా ఉందని ఈ యూనివర్స్‌ బాస్‌ చెప్పకనే చెబుతున్నాడు

ఇదీ చదవండి:కరోనా సంక్షోభంలోనూ తరగని కోహ్లీ బ్రాండ్ వాల్యూ!

ABOUT THE AUTHOR

...view details