ఐపీఎల్ షెడ్యూల్ వచ్చేసింది. దీంతో మహేంద్రసింగ్ ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ సాధన మొదలు పెట్టింది. నిర్ణీత క్వారంటైన్ వ్యవధిలో కరోనా టెస్టులు విజయవంతంగా పూర్తి చేసుకున్న సూపర్‌కింగ్స్ ఆటగాళ్లు నెట్స్‌లోకి వచ్చారు. ధోనీతో పాటు అంబటి రాయుడు, రుతురాజ్ గైక్వాడ్, జగదీశన్, సాయి కిశోర్, హరి నిశాంత్ తదితరులు సోమవారం నుంచే సాధన మొదలుపెట్టారు. కొత్తగా జట్టులోకి వచ్చిన ఆంధ్ర కుర్రాడు హరిశంకర్ రెడ్డి కూడా చెన్నైతో చేరాడు.
టైటిల్ వేటలో సీఎస్కే- చెమటోడుస్తున్న ఆటగాళ్లు
ఐపీఎల్ తేదీలు ఖరారైపోయాయి. దీంతో చెన్నై ఆటగాళ్లు ప్రాక్టీస్ షురూ చేశారు. క్వారంటైన్‌ను పూర్తి చేసుకున్న ఆ జట్టు ఆటగాళ్లు.. సోమవారం నుంచే నెట్స్‌లోకి వచ్చారు. ధోనీతో పాటు రాయుడు, రుతురాజ్ గైక్వాడ్, జగదీశన్, సాయి కిశోర్, హరి నిశాంత్ తదితరులు సాధన మొదలు పెట్టారు.
ఐపీఎల్ కోసం చెన్నై ఆటగాళ్ల ప్రాక్టీస్ షురూ
"క్వారంటైన్ నిబంధనలను పూర్తి చేసిన చెన్నై ఆటగాళ్లు సోమవారం నుంచే సాధన మొదలుపెట్టారు. త్వరలోనే మిగిలిన ఆటగాళ్లు కూడా వీరితో కలుస్తారు" అని సీఎస్కే వర్గాలు తెలిపాయి. ఇటీవల మినీ వేలంలో మొయిన్ అలీ (రూ.7 కోట్లు), గౌతమ్ (రూ.9.25 కోట్లు), పుజారా (రూ.50 లక్షలు)లను చెన్నై కొనుగోలు చేసింది. ఐపీఎల్ వచ్చే నెల 9న ప్రారంభం కానుంది. తన తొలి పోరులో (ఏప్రిల్ 10) దిల్లీ క్యాపిటల్స్‌తో చెన్నై తలపడనుంది.
Last Updated : Mar 10, 2021, 10:21 AM IST