టీమ్ఇండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్‌పై హర్యానాలోని హన్సీ గ్రామంలో పోలీసు కేసు నమోదైంది. ఇటీవలో స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మతో జరిగిన లైవ్‌లో మాట్లాడుతూ ఓ సామాజిక వర్గంపై యువీ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశాడని.. సామాజిక కార్యకర్త, న్యాయవాది రజత్ కల్సన్ కేసు పెట్టారు.
మాజీ క్రికెటర్ యువరాజ్‌పై పోలీస్ కేసు
ఇటీవలే ఓ లైవ్‌చాట్‌లో మాట్లాడుతూ ఓ సామాజిక వర్గంపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశాడని, భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్‌పై పోలీసు కేసు నమోదైంది.
మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్
వైరల్‌గా మారిన ఈ వీడియోలో యువరాజ్ అన్న మాటల్ని దేశంలోని అందరూ విన్నారని తెలిపారు. ఆ సామాజిక వర్గ మనోభావాలు దెబ్బతీసీన యువీపై చర్యలు తీసుకోవాలని రజత్ కల్సన్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఒకవేళ పోలీసులు సత్వర చర్యలు తీసుకోకపోతే, పెద్ద ఉద్యమం చేస్తామని చెప్పారు.
Last Updated : Jun 5, 2020, 1:43 PM IST