కరోనాతో నెలలపాటు నిలిచిపోయిన క్రికెట్ కార్యకలాపాలు ఇప్పుడిప్పుడే ప్రారంభమవుతున్నాయి. ఈ క్రమంలోనే సెప్టెంబరు 19 నుంచి ఐపీఎల్ ప్రారంభం కానుండటం వల్ల.. అభిమానుల చూపులన్నీ ఈ లీగ్‌పైనే ఉన్నాయి. తాజాగా, చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్కే) బ్యాట్స్‌మన్ సురేశ్ రైనా స్పందిస్తూ.. టోర్నీ ప్రారంభించే వరకు ఎదురు చూడటం తన వల్ల కాదని ఇన్స్టాగ్రామ్ వేదికగా పేర్కొన్నాడు. తన సహచరులు ధోనీ, మురళీ విజయ్‌లతో సరదాగా నవ్వుతున్న ఫొటోను అభిమానులతో పంచుకున్నాడు.
"మైదానంలో అడుగుపెట్టేందుకు రోజులు లెక్కిస్తున్నా. ప్రతి నిమిషం ఎంతో ఆనందంగా ఉంది. సీజన్ ప్రారంభించేవరకు నేను ఎదురు చూడలేకపోతున్నా."