తెలంగాణ

telangana

ETV Bharat / sports

భారత్​తో టీ20లకు ఇంగ్లాండ్ జట్టు ఇదే - బెయిర్ స్టో

భారత్​తో టీ20 సిరీస్​కు 16 మందితో కూడిన జట్టును ప్రకటించింది ఇంగ్లాండ్. జోస్ బట్లర్, జానీ బెయిర్​ స్టో తిరిగి టీంలోకి రానున్నారు.

Buttler, Bairstow back for T20Is against India as England name 16-member squad
భారత్​తో టీ20లకు ఇంగ్లాండ్ జట్టు ఇదే

By

Published : Feb 11, 2021, 6:51 PM IST

భారత్​తో జరిగే 5 మ్యాచ్​ల టీ 20 సిరీస్​కు 16 మందితో కూడిన జట్టును ప్రకటించింది ఇంగ్లాండ్. జోస్ బట్లర్, జానీ బెయిర్​ స్టో తిరిగి జట్టులోకి రానున్నారు. అహ్మదాబాద్​లో మార్చి 12 నుంచి 20 వరకు ఈ సిరీస్​ జరగనుంది.

టీమ్​ఇండియాతో తొలి టెస్టు అనంతరం బట్లర్​ స్వదేశానికి వెళ్లాడు. కాగా, బెయిర్​ స్టోకు తొలి రెండు టెస్టులకు విశ్రాంతినిచ్చింది పర్యటక జట్టు. టెస్టు సిరీస్​ మొత్తానికే వైదొలిగిన ఆల్​రౌండర్​ సామ్​ కరన్ కూడా టీ 20 జట్టుకు ఎంపికయ్యాడు. టీ-20ల్లో అదరగొడుతోన్న డేవిడ్​ మలన్ కూడా పొట్టి క్రికెట్లో ఆడనున్నాడు. రానున్న ఐపీఎల్​ వేలంలో ఇతడిపై ఫ్రాంఛైజీలు ఆసక్తి చూపుతాయనడంలో ఆశ్చర్యం లేదు.

స్టార్​ పేసర్లు జేమ్స్​ అండర్సన్, స్టువర్ట్ బ్రాడ్​ టీ 20 జట్టులో లేరు. జోఫ్రా ఆర్చర్​ మాత్రం టీ20ల్లో ఆడనున్నాడు. వన్డే జట్టును త్వరలోనే ప్రకటించనుంది ఇంగ్లీష్ జట్టు.

టీ20 సిరీస్​కు ఇంగ్లాండ్ జట్టు:

ఇయాన్ మోర్గాన్, మొయిన్ అలీ, జోఫ్రా ఆర్చర్, బెయిర్​ స్టో, సామ్ బిల్లింగ్స్, జోస్ బట్లర్, సామ్ కరన్, టామ్ కరన్, క్రిస్ జోర్డాన్, లియమ్ లివింగ్​స్టోన్, డేవిడ్ మలన్, ఆదిల్ రషీద్, జేసన్ రాయ్, బెన్​ స్టోక్స్, రీసీ టోప్లే, మార్క్ వుడ్.

ఇదీ చూడండి:'రూట్​ ఆ రికార్డులను తిరగరాయడం పక్కా'

ABOUT THE AUTHOR

...view details