తెలంగాణ

telangana

ETV Bharat / sports

'పేసర్​ బుమ్రా గాయంపై ఆందోళన అనవసరం'

ముంబయి ఇండియన్స్ పేస్ బౌలర్ బుమ్రాకు అయిన గాయంపై ఆందోళన అక్కర్లేదని బీసీసీఐ స్పష్టం చేసింది.

గాయంతో బాధపడుతున్న బుమ్రా

By

Published : Mar 26, 2019, 1:02 PM IST

దిల్లీ క్యాపిటల్స్​తో జరిగిన మ్యాచ్​లో బంతిని ఆపే క్రమంలో ముంబయి బౌలర్ బుమ్రా గాయపడ్డాడు. దీనిపై బీసీసీఐ స్పందిస్తూ.. పెద్దగా ఆందోళన పడాల్సిన అవసరం లేదని తెలిపింది. ఫీల్డింగ్ చేస్తూ కిందపడిన బుమ్రా ఎడమచేతికి దెబ్బతగిలింది. వైద్యపరీక్షలు చేసిన అనంతరం.. అతడికి అంత ప్రమాదమేమి లేదని తేలింది.

గాయం కారణంగా దిల్లీతో జరిగిన మ్యాచ్​లో బుమ్రా బ్యాటింగ్​కి రాలేదు. దీంతో పెద్ద దెబ్బే కావచ్చని అందరూ అనుమానించారు. డెత్ ఓవర్ల స్పెషలిస్టు బౌలర్​గా పేరొందిన బుమ్రా.. ప్రపంచకప్​లో భారత జట్టుకు చాలా అవసరం.

ఈ నెల29న రెండో మ్యాచ్​లో ముంబయి ఇండియన్స్ ఆర్సీబీతో తలపడనుంది. జట్టు ఇప్పటికే బెంగళూరు చేరుకుంది. బుమ్రా మాత్రం ముంబయిలోనే ఉండిపోయాడు.
ఇవీ చూడండి..అమెరికా బౌట్​కు విజేందర్ దూరం- గాయమే కారణం

ABOUT THE AUTHOR

...view details