తెలంగాణ

telangana

ETV Bharat / sports

బుమ్రా, మంధానకు 'క్రికెటర్​ ఆఫ్​ ద ఇయర్​' పురస్కారాలు

భారత స్టార్​ పేసర్​ జస్ప్రీత్​ బుమ్రా, మహిళా క్రికెటర్​ స్మృతి మంధానకు అరుదైన గౌరవం దక్కింది. ఈ ఏడాది 'క్రికెటర్​ ఆఫ్​ ద ఇయర్'​ అవార్డులకు ఎంపికయ్యారు. ఈ ఘనత సాధించిన మూడో మహిళా క్రికెటర్​గా మంధాన నిలిచింది.

'క్రికెటర్​ ఆఫ్​ ద ఇయర్​'గా బుమ్రా, మందానా

By

Published : Oct 25, 2019, 5:52 PM IST

భారత స్టార్ క్రికెటర్లు జస్ప్రీత్​ బుమ్రా, స్మృతి మంధాన... ప్రతిష్ఠాత్మక పురస్కారాలకు ఎంపికయ్యారు. విజ్డన్​ ఇండియా అల్మానక్ ప్రతి ఏటా బహుకరించే 'క్రికెటర్​ ఆఫ్​ ద ఇయర్​' అవార్డులను అందుకోనున్నారు. ఈ అరుదైన ఘనత సాధించిన మూడో క్రికెటర్​గా మంధాన నిలిచింది. గతంలో మిథాలీ రాజ్​, దీప్తి శర్మ ఈ గౌరవం పొందారు.

బుమ్రా, మందానా

ఈ పురస్కారాలకు ఐదుగురి పేర్లను ఎంపిక చేశారు. ఇందులో బుమ్రా, స్మృతి.. భారత్​కు చెందినవారు. వీరితో పాటు పాకిస్థాన్​కు చెందిన ఫకర్​ జమాన్​, శ్రీలంక నుంచి కరుణరత్నె, అఫ్గానిస్థాన్​ స్పిన్నర్ రషీద్​ ఖాన్​ చోటు దక్కించుకున్నారు.

2019-20 కాలానికిగానూ ఏడో ఎడిషన్​ వార్షిక సంచికల్లో మయాంక్​ అగర్వాల్ గురించి ప్రత్యేక కథనాలు ముద్రించారు.​ ఇటీవలే దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్​ సహా దేశవాళీ మ్యాచ్​ల్లో అద్భుత ఆటతీరు కనబర్చాడీ బ్యాట్స్​మెన్​.

వీరితో పాటు క్రికెట్​లో చేసిన సేవలకుగానూ మాజీ క్రికెటర్లు గుండప్ప విశ్వనాథ్​, లాలా అమర్​నాథ్​లు... విజ్డన్​ ఇండియా అల్మానక్ 'హాల్​ ఆఫ్​ ఫేమ్'​లో చోటు దక్కించుకున్నారు. ప్రముఖ రచయిత ప్రశాంత్​ కిదాంబి 'బుక్​ ఆఫ్​ ద ఇయర్​' అవార్డు అందుకోనున్నాడు. ఈయన రచించిన 'అన్​టోల్డ్​ హిస్టరీ ఆఫ్​ ద ఫస్ట్​ ఆల్​ ఇండియా టీమ్​' బాగా పేరు తెచ్చుకుంది.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details