పాకిస్థాన్తోఇటీవలే జరిగిన రెండు టెస్టుల సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసింది ఆస్ట్రేలియా. న్యూజిలాండ్‌తో ప్రస్తుతం జరుగుతున్న తొలి టెస్టులోనూ విజయం దిశగా దూసుకెళ్తోంది. అయితే ఆసీస్ విజయాలను ఉద్దేశిస్తూ, ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ మైకేల్ వాన్ చేసిన ట్వీట్‌పై పలువురు క్రికెటర్లు స్పందిస్తున్నారు.
"ప్రస్తుత పరిస్థితుల్లో ఆస్ట్రేలియాను, భారత్ మినహా మరే జట్టు ఓడించలేదు" అని వాన్ ట్విట్టర్ వేదికగా తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు.
ఈ ట్వీట్‌పై కివీస్ మాజీ కెప్టెన్ బ్రెండన్ మెకల్లమ్ స్పందించాడు. "వాన్ నువ్వు కాస్త ముందుగానే స్పందించావు. బౌల్ట్ పునరాగమనం చేస్తాడు. అప్పుడు కివీస్‌కు భారీ ప్రయోజనం చేకూరుతుంది. డే/నైట్ టెస్టులో ఆసీస్ 1-0 తేడాతో ముందంజ వేసిన న్యూజిలాండ్ మళ్లీ పుంజుకుంటుంది" అని పోస్ట్ పెట్టాడు.