తెలంగాణ

telangana

ETV Bharat / sports

విండీస్​ బౌలర్ యాక్షన్​​​పై ఐసీసీకి ఫిర్యాదు - west indies

భారత్​తో మ్యాచ్​లో విండీస్ క్రికెటర్ బ్రాత్​వైట్ అనుమానాస్పద బౌలింగ్​పై ఐసీసీకి ఫిర్యాదు అందింది. ఈనెల​ 14లోపు బౌలింగ్ యాక్షన్​పై అతడు పరీక్షలకు హాజరవ్వాల్సి ఉంటుంది.

బ్రాత్​వైట్

By

Published : Sep 8, 2019, 5:03 PM IST

Updated : Sep 29, 2019, 9:45 PM IST

వెస్టిండీస్ క్రికెటర్ క్రెయిగ్ బ్రాత్​వైట్ బౌలింగ్​ యాక్షన్​పై అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ)కి ఫిర్యాదు అందింది. కింగ్​స్టన్ వేదికగా టీమిండియాతో జరిగిన రెండో టెస్టులో అతడి బౌలింగ్ సరళిపై అనుమానం వ్యక్తం చేసిన మ్యాచ్​ రిఫరీ.. ఐసీసీకి ఫిర్యాదు చేశారు.

ఇంతకుమందు 2017ఆగస్టులో ఇంగ్లాండ్​తో జరిగిన మ్యాచ్​లోనూ ఇదే రీతిలో ఫిర్యాదు అందుకున్నాడీ ఆటగాడు. అప్పుడు ఐసీసీ నిర్వహించిన పరీక్షల్లో సఫలమయ్యాడు.

బ్రాత్​వైట్.. బౌలింగ్ యాక్షన్​పైఐసీసీ నిర్వహించే పరీక్షలకు ఈ నెల 14లోపు హాజరవ్వాల్సి ఉంటుంది. అందులో యాక్షన్ విరుద్ధంగా ఉందని తేలితే అతడి బౌలింగ్​పై నిషేధం విధించే అవకాశం ఉంది.

ఇవీ చూడండి.. శాంసన్ మంచి మనసు... మైదాన సిబ్బందికి సాయం

Last Updated : Sep 29, 2019, 9:45 PM IST

ABOUT THE AUTHOR

...view details