తెలంగాణ

telangana

ETV Bharat / sports

"బ్రెయిన్​ లేకుండా బ్యాటింగ్ చేశారు" - england

యాషెస్​ సిరీస్​ మూడో టెస్టులో ఇంగ్లాండ్ 67 పరుగులకే ఆలౌట్ అవడం పట్ల ఆ దేశ మాజీ ఓపెనర్ జోఫ్రే బాయ్​కాట్ ఘాటుగా స్పందించాడు. బ్రెయిన్​ లేకుండా బ్యాటింగ్ చేశారంటూ మండిపడ్డాడు.

బాయ్​కాట్​

By

Published : Aug 24, 2019, 8:24 PM IST

Updated : Sep 28, 2019, 3:52 AM IST

యాషెస్ మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్​లో ఇంగ్లాండ్ 67 పరుగులకే ఆలౌట్​ అయింది. ఈ అంశంపై ఇంగ్లీష్ జట్టు మాజీ ఓపెనర్ జోఫ్రే బాయ్​కాట్ ఘాటుగా స్పందించాడు. గురువారం మ్యాచ్​లో ఇంగ్లాండ్ ఆటగాళ్లు బుర్రలేని వాళ్లలా బ్యాటింగ్(బ్యాటెడ్ వితౌట్​ బ్రెయిన్స్​) చేశారంటూ విమర్శించాడు.

"ఇంగ్లాండ్ జట్టుకు ఏమైందో అర్థం కావడం లేదు. ఇలాంటి బ్యాటింగ్​తో యాషెస్ సిరీస్​ ఎలా నెగ్గుతారు. ఓ రోజు మొత్తం ఆడినా.. ఇంగ్లీష్ జట్టుకు 100 పరుగుల ఆధిక్యం వచ్చేది. కానీ వాళ్లు తెలివి తక్కువతనంగా బ్యాటింగ్ చేసి పెవిలియన్ బాట పట్టారు" -జోఫ్రే బాయ్​కాట్​, ఇంగ్లాండ్ మాజీ ఓపెనర్.

ప్రపంచకప్​లో సత్తాచాటిన జేసన్ రాయ్ ఈ సిరీస్​లో ఏమాత్రం ప్రభావం చూపలేకపోయాడని, హజిల్​వుడ్ బౌలింగ్​లో చెత్తబంతికి స్లిప్​లో క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడని తెలిపాడు బాయ్​కాట్​. రెండో ఇన్నింగ్స్​లో ఎన్ని పరుగులు చేస్తాడో తెలియదు కాని, ఇదే బ్యాటింగ్ కొనసాగిస్తే అతడి మెదడును పరీక్షించాలని చెప్పాడు.

మూడో టెస్టులో మొదట బ్యాటింగ్ చేసిన ఆసీస్ 179 పరుగులకు ఆలౌటైంది. అనంతరం బరిలోదిగిన ఇంగ్లాండ్ హజిల్​వుడ్​(5 వికెట్లు) దెబ్బకు 67 పరుగులకే కుప్పకూలింది. రెండో ఇన్నింగ్స్​లో కంగారూ జట్టు 246 పరుగులకు ఆలౌట్​ కాగా.. 359 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు ఇంగ్లీష్ జట్టు బరిలో దిగింది.

ఇది చదవండి: ప్రపంచ ఛాంపియన్​షిప్​: ప్రణీత్​కు కాంస్యమే

Last Updated : Sep 28, 2019, 3:52 AM IST

ABOUT THE AUTHOR

...view details