తెలంగాణ

telangana

By

Published : Nov 12, 2019, 11:23 AM IST

Updated : Nov 12, 2019, 12:08 PM IST

ETV Bharat / sports

డైపర్ వేసుకొని డ్రైవ్​లు బాదేస్తున్న బుడతడు!

డైపర్లు ధరించే వయసున్న ఓ బాలుడు అద్భుతమైన కవర్ డ్రైవ్​లు, ఫ్రంట్ ఫూట్ షాట్లతో క్రికెట్ ఆడుతూ అలరిస్తున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.

వైరల్: డైపర్లు వేసుకొని డ్రైవ్​లు బాదేస్తున్న బుడతడు!

క్రికెట్ జెంటిల్మన్ గేమ్​.. మాస్టర్ సచిన్ తెందూల్కర్ స్ట్రయిట్ డ్రైవ్​ ఆడినా.. కోహ్లీ కవర్ డ్రైవ్ కొట్టినా.. రోహిత్​ ఫుల్ షాట్ బాదినా.. అభిమానులు ఫిదా అయిపోవాల్సిందే. వీరందరిని అనుకరిస్తూ ఓ బాలుడు క్రికెట్ షాట్లతో ఆకట్టుకుంటున్నాడు. డైపర్లు వేసుకుని కవర్ డ్రైవ్​, ఫ్రంట్ ఫుట్, లాప్టెడ్ షాట్లు కొడుతున్న ఈ చిన్నారి వీడియో ప్రస్తుతం వైరల్​గా మారింది.

ఈ బుడతడి స్టైలిష్ బ్యాటింగ్​కు మెచ్చిన ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ మైఖేల్ వాన్ సామాజిక మాధ్యమాల్లో స్పందించాడు. 'ఇంగ్లీష్ క్యాట్' అంటూ కామెంట్ పెట్టాడు.

"ఇప్పటికీ డైపర్లు వేసుకుంటున్నాడు... బ్యాటింగ్ చూస్తే క్లబ్ క్రికెటర్లను మించి ఉంది" అని ఫాక్స్ క్రికెట్ సంస్థ ట్వీట్ చేసింది.

ప్రస్తుతం ఈ బాలుడి బ్యాటింగ్​కు నెటిజన్లు విశేషంగా స్పందిస్తున్నారు. "డైపర్​తో పాటు గ్లౌవ్స్ వేసుకుని ప్రొఫెషన్ల మాదిరిగా ఆడుతున్నాడు" అని కామెంట్లు పెడుతున్నారు.

ఇదీ చదవండి: సచిన్​ స్ఫూర్తితో లేడీ మాస్టర్​గా ఎదిగిన షెఫాలీ

Last Updated : Nov 12, 2019, 12:08 PM IST

ABOUT THE AUTHOR

...view details