ఇంగ్లాండ్, వెస్టిండీస్ మధ్య బయో సెక్యూర్ విధానంలో నిర్వహించిన తొలి టెస్టు కరోనా విరామం తర్వాత జరిగిన తొలి అంతర్జాతీయ మ్యాచ్. అయితే ఈ పోరుపై టీమ్ఇండియా మాజీ పేసర్ ఇర్ఫాన్ పఠాన్ స్పందిస్తూ.. ప్రపంచవ్యాప్తంగా ఫాస్ట్ బౌలర్లు కొద్దికాలం పాటు రివర్స్ స్వింగ్‌ను మరచిపోవాలని అభిప్రాయపడ్డాడు. తొలి టెస్టులో ఐదోరోజు జరిగిన మ్యాచ్‌లో మార్క్ వుడ్, జోఫ్రా ఆర్చర్ బౌలింగ్ చూసిన పఠాన్.. ఈ వ్యాఖ్యలు చేశాడు. కరోనా వ్యాప్తి ముప్పు నేపథ్యంలో అంతర్జాతీయ క్రికెట్లో లాలాజలం నిషేధించింది ఐసీసీ. ఈ క్రమంలోనే బౌలర్లకు కష్టంగా మారింది.
"లాలాజలం మందంగా ఉంటుంది. అందుకే చెమట కంటే వేగంగా బంతిని మెరిసేలా చేసి రివర్స్ స్వింగ్ చేయడానికి వీలు కల్పిస్తుంది. మహమ్మారి కారణంగా లాలాజలం నిషేధం కొనసాగే వరకు బౌలర్లకు కాస్త కష్టమే. కాబట్టి కొంత కాలం రివర్స్ స్వింగ్‌ను మర్చిపోండి. ఫాస్ట్ బౌలింగ్‌కు అనుకూలంగా ఉండే పిచ్‌లను తయారు చేయండి. పిచ్‌పై తేమ ఉంచడం మంచిదని నా సలహా. దీంతో బంతి ఉపరితలం ఆ తేమను పట్టుకుంటుంది. ఫలితంగా చెమట, లాలాజలం వినియోగానికి దూరంగా ఉండే అవకాశం ఉంది."