భారత స్పిన్నర్ కుల్దీప్ యాదవ్.. సొంత ఊరిలో ప్రాక్టీసు మొదలుపెట్టాడు. రోజుకు నాలుగు గంటలపాటు నెట్స్‌లో బౌలింగ్ చేస్తున్నట్లు చెప్పాడు. అయితే ఐసీసీ విధించిన కొత్త నిబంధనల వల్ల బంతిపై సలైవా(లాలాజలం) రుద్దకుండా ఉండేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు చెప్పుకొచ్చాడు.
"గత వారం నుంచి రోజుకు రెండు సెషన్స్(ఉదయం, సాయంత్రం) నెట్స్‌లో భౌతిక దూరం పాటిస్తూ బౌలింగ్ ప్రాక్టీసు చేస్తున్నా. కొన్ని వారాల్లో మ్యాచ్‌లకు సిద్ధమవుతానని భావిస్తున్నా. చిన్నప్పటి నుంచి బంతి మెరుపు కోసం ఉమ్మి రాయడం అలవాటు. ఐసీసీ కొత్త నిబంధనల వల్ల ఆ అలవాటు మానుకోవాలని అనుకుంటున్నా."