సినిమా, క్రికెట్.. ఈ రెండు రంగాలది విడదీయరాని బంధం. ఈ రెండింటికి ప్రేక్షకుల్లో విశేష ఆదరణ ఉంది. అందుకే వీటికి సంబంధించి ఏ విషయమైనా క్షణాల్లో వైరల్ అవుతుంటుంది. ఇక క్రికెటర్స్ హీరోయిన్స్ మధ్య ఎఫైర్స్ అయితే ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. వీరి మధ్య ప్రేమాయణం ఈనాటిదికాదు.. నాటి ఇమ్రాన్ ఖాన్- దీవా జీనత్, కపిల్‌దేవ్-సారికా నుంచి నేటి విరాట్ కోహ్లీ-అనుష్కశర్మ వరకు ఎందరో క్రికెటర్లు హీరోయిన్లు మధ్య ప్రేమకథలు తెరపైకి వస్తూనే ఉన్నాయి. కానీ ఇందులో చాలా వరకు మధ్యలోనే బ్రేకప్ అవ్వడం.. కొన్ని అవి నిజం కాదని తేలడం, మరికొన్ని పెళ్లి పీటలు వరకు వెళ్లడం జరిగాయి. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు మన స్టార్ క్రికెటర్లు హీరోయిన్స్ మధ్య చిగురించినట్లు తెలిసిన ప్రేమ కథల సమాహారమే ఈ కథనం.
ఇమ్రాన్ ఖాన్- దివా జీనత్
పాకిస్థాన్ మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ బాలీవుడ్ సీనియర్ నటి దివా జీనత్ రిలేషిన్‌షిప్‌లో ఉన్నట్లు అప్పట్లో తెగ వార్తలు వచ్చాయి. ఎక్కడు చూసిన ఈ జంట కెమెరా కంటికి తెగ కనిపించేవారు. వీరి గురించి అనేక కథనాలు ప్రచరితమయ్యేవి. కానీ ఆ తర్వాత జీనత్, మజ్హర్ను మనువాడగా.. ఇమ్రాన్, బ్రిటీష్ బిలీయనీర్ హైరెస్ జెమిమా గోల్డ్‌స్మిత్‌ను పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం ఆయన పాకిస్థాన్‌కు ప్రధానమంత్రిగా వ్యవహరిస్తున్నారు.
వీవ్ రిచర్డ్స్-నీనా గుప్తా
వెస్టిండీస్ మాజీ క్రికెటర్ వీవ్ రిచర్డ్స్, సీనియర్ నటి నీనా గుప్తా అప్పట్లో కొంతకాలం ప్రేమించుకున్నారు. వీరిద్దరికీ ఓ బిడ్డ కూడా జన్మించింది. ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల నీనా, వీవ్ విడిపోయి వేర్వేరుగా వివాహాలు చేసుకున్నారు. అయితే పెళ్లికి ముందే బిడ్డకు జన్మనివ్వడం వల్ల సమాజంలో తనపై ప్రతికూల ప్రభావం పడిందని నీనా ఓ సందర్భంలో తెలిపింది. చివరిగా 'శుభ్ మంగళ్ జ్యాదా సావ్‌ధాన్' అనే బాలీవుడ్ చిత్రంలో ఆమె నటించింది.
కపిల్‌దేవ్- సారికా
భారత దిగ్గజ క్రికెటర్ కపిల్ దేవ్ పెళ్లికి ముందు సీనియర్ నటి సారికాతో ప్రేమాయణం నడిపాడు. ఎక్కడ చూసిన ఈ జంట తెగ కనపడేవారు. అనంతరం కొన్ని కారణాల వల్ల విడిపోయి కపిల్.. రోమి భాటియాను, సారికా స్టార్ నటుడు కమలహాసన్‌ను పెళ్లిచేసుకున్నారు.
మహ్మద్ అజారుద్దీన్- సంగీత బిజ్లానీ
1996లో భారత మాజీ క్రికెటర్ మహ్మద్ అజా బాలీవుడ్ సీనియర్ నటి, 1980 మిస్ఇండియా విజేత సంగీత బిజ్లానీ.. తాము ప్రేమలో ఉన్నట్లు పెళ్లి కూడా చేసుకోబోతున్నామని బహిరంగంగానే ప్రకటించారు. కానీ అది జరగలేదు.
మోహ్సిన్ ఖాన్- రీనా రాయ్
పాకిస్థాన్ మాజీ క్రికెటర్, బాలీవుడ్ సీనియర్ నటి రీనా రాయ్ పీకల లోతుదాగా ప్రేమించుకుని పెళ్లి కూడా చేసుకున్నారు. వారిద్దరికి ఓ బిడ్డ జన్మించాక మనస్పర్థల కారణంగా విడిపోయారు.
రవిశాస్త్రి-అమ్రితా సింగ్
80ల కాలంలో టీమ్ఇండియా కోచ్ రవిశాస్త్రి, నటి అమ్రితా సింగ్ రిలేషన్షిప్లో ఉన్నట్లు అప్పట్లో ప్రచారం జోరుగా సాగింది. వీరిద్దరికి 1986లో నిశ్చితార్థం కూడా జరిగినట్లు వార్తల వచ్చాయి. కానీ ఆ తర్వాత శాస్త్రి 1990లో రీతూను పెళ్లి చేసుకోగా.. అమ్రితా, నటుడు సైఫ్ అలీఖాన్‌తో ప్రేమలో పడింది.