భారత బ్యాట్స్‌మన్ కేఎల్ రాహుల్... ఆటతోనే కాకుండా పలు విషయాల్లో ఉంటూ, తరుచూ వార్తల్లో నిలుస్తుంటాడు. బాలీవుడ్ భామలు, మోడల్స్‌తో.. డేటింగ్, ప్రేమ విషయంలో చాలాసార్లు చర్చనీయాంశంగా మారాడు ఈ స్టైలిష్ క్రికెటర్. ఇప్పుడు హిందీ నటి అతియా శెట్టితో కలిసి కనిపించాడు.
వీరిద్దరూ కలిసి తీసుకున్న ఫొటోను సామాజిక మధ్యమాల్లో షేర్ చేసిన రాహుల్.. 'హేరా ఫేరీ' సినిమాలోని 'హలో దేవీ ప్రసాద్' అనే పాపులర్ డైలాగ్‌ను జోడించాడు. ఇందులో రాహుల్.. ఫోన్ పట్టుకుని గంభీరంగా కనిపిస్తుండగా... అతియా నవ్వులు చిందిస్తోంది. ఈ పోస్టు చూసిన నెటిజన్లు.. వీరి మధ్య ప్రేమ మరింత బలపడుతోందని భావిస్తున్నారు. ఇప్పుడీ ఫొటోపై హీరోయిన్ తండ్రి, సీనియర్ నటుడు సునీల్ శెట్టి స్పందించాడు. 'ఓకే హంద్' అనే సరదా డైలాగుతో సమాధానం ఇచ్చాడు.