తెలంగాణ

telangana

ETV Bharat / sports

బంతి ముఖానికి తగిలి దిండాకు గాయం - అశోక్ దిండా

సీటీ స్కాన్ అనంతరం దిండాకు ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు ప్రకటించారు.

భారత బౌలర్ అశోక్ దిండాకు గాయం

By

Published : Feb 11, 2019, 9:23 PM IST

భారత బౌలర్ అశోక్ దిండాకు గాయమైంది. కోల్​కతా ఈడెన్ గార్డెన్స్​లో జరుగుతున్న ముస్తాక్ అలీ ఛాంపియన్​షిప్​ టీ 20 ప్రాక్టీస్ మ్యాచ్​లో ఇది జరిగింది. దిండా బౌలింగ్​ చేస్తుండగా బ్యాట్స్​మెన్​ బంతిని అతడి వైపునకు బలంగా బాదాడు. రన్​అప్​లో బంతిని ఆపే ప్రయత్నం చేసిన దిండా ముఖానికి బాల్ బలంగా తగిలింది. అతడు అక్కడికక్కడే కిందపడిపోయాడు.

అనంతరం వైద్యబృందం ప్రాథమిక చికిత్స చేసి దిండాను ఆసుపత్రికి తరలించింది. సీటీ స్కాన్ తదితర పరీక్షలు నిర్వహించిన వైద్యులు.. అతడికి ఎలాంటి ప్రమాదం లేదని ప్రకటించారు.

భారత్​ జట్టు తరఫున 13 వన్డేలు, 9 టీ 20లకు ప్రాతినిథ్యం వహించాడు దిండా. చివరిసారిగా 2013లో అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన దిండా.. దేశవాళీ మ్యాచ్​ల్లో తన ప్రతిభ నిరూపించుకుంటున్నాడు. ప్రస్తుతం బంగాల్ తరఫున సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో ఆడుతున్నాడు.

ABOUT THE AUTHOR

...view details