తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఆర్చర్​లో​ అద్భుతమైన ప్రతిభ ఉంది: మోర్గాన్

జోఫ్రా ఆర్చర్​లో ప్రత్యేకమైన టాలెంట్ ఉందని, వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ సత్తా చాటుతున్నాడని ఇంగ్లాండ్ వన్డే సారథి ఇయాన్ మోర్గాన్ అన్నాడు.

By

Published : Sep 24, 2019, 6:11 AM IST

Updated : Oct 1, 2019, 7:03 PM IST

మోర్గాన్ - ఆర్చర్

ఇంగ్లాండ్ బౌలర్ జోఫ్రా ఆర్చర్​పై ఆ జట్టు వన్డే కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ పొగడ్తల వర్షం కురిపిస్తున్నాడు. అతడికి ప్రత్యేకమైన టాలెంట్ ఉందని, ఆర్చర్ బౌలింగ్ చూస్తుంటే ఎంతో థ్రిల్లింగ్​గా ఉంటుందని చెప్పాడు.

"అతడో(జోఫ్రా ఆర్చర్) అద్భుతమైన బౌలర్. అవరోధాలను అధిగమిస్తూ ఎదిగాడు. అతడిలో ఇంకా ఎంతో ప్రతిభ దాగుంది. ఎప్పుడూ నేర్చుకుంటూ ఉంటాడు. ఆర్చర్ బౌలింగ్ చూస్తుంటే ఎంతో థ్రిల్లింగ్​గా ఉంటుంది" -ఇయాన్ మోర్గాన్, ఇంగ్లాండ్ వన్డే కెప్టెన్.

ప్రపంచకప్​లో జోఫ్రా ఆర్చర్ ఇంగ్లాండ్ తరపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్​గా నిలిచాడు. యాషెస్​ సిరీస్​లోనూ 20.27 సగటుతో 22 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.

ఇదీ చదవండి: టీమిండియా మాజీ క్రికెటర్ కన్నుమూత..

Last Updated : Oct 1, 2019, 7:03 PM IST

ABOUT THE AUTHOR

...view details