ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్.. వెస్టిండీస్‌తో జరుగుతోన్న ద్వైపాక్షిక సిరీస్‌లో మార్మోగుతోన్న పేరు. ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ తనదైన ఆటతో ప్రత్యర్థులపై విరుచుకుపడుతున్నాడు. రెండో టెస్టులో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించి 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్'గా నిలిచాడు.
అయితే ఈ రెండో టెస్టులో భాగంగా చివరి రోజు ఆట 43వ ఓవర్లో బౌలింగ్ చేసిన స్టోక్స్.. అదే బంతికి ఫీల్డింగ్ కూడా చేసి ఓ అద్భుతమైన స్టంట్ చేశాడు. దీనికి సంబంధించిన వీడియో ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు ట్విట్టర్లో పోస్ట్ చేసింది. "స్టోక్స్‌కు ఆటపట్ల ఉన్న నిబద్ధత మెచ్చుకోవాల్సిందే" అని వ్యాఖ్య రాసుకొచ్చింది.
స్టోక్స్ వేసిన బంతిని బ్లాక్‌వుడ్ లాంగ్ ఆఫ్ మీదుగా ఆడాడు. అక్కడ ఫీల్డర్లు ఎవరూ లేకపోవడం వల్ల స్టోక్స్ వేగంగా పరుగెత్తి ఆ బంతిని బౌండరీ లైన్ దాటకుండా అద్భుతమైన స్టంట్ చేసి ఆపాడు. ఈ స్టంట్ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంది.
ఈ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 176 పరుగులతో ఆకట్టుకున్న స్టోక్స్.. రెండో ఇన్నింగ్స్‌లో 78 పరుగులు చేశాడు. ఆది నుంచే ఆధిపత్యానికి ప్రయత్నించిన ఆతిథ్య జట్టు.. బ్యాటింగ్, బౌలింగ్‌తోనూ రాణించి కరీబియన్ జట్టును మట్టికరిపించింది. ఆఖరికి 113 పరుగుల తేడాతో గెలిచిన ఇంగ్లాండ్.. సిరీస్‌ను 1-1తో సమం చేసింది.
ఇది చూడండి : విండీస్‌పై ఇంగ్లాండ్ విజయం.. సిరీస్ 1-1తో సమం