ఐపీఎల్‌లో ప్రతి మూడేళ్లకూ మెగా వేలం నిర్వహించడం మామూలే. జట్లు గరిష్ఠంగా నలుగురు ఆటగాళ్లను మాత్రమే అట్టిపెట్టుకుని మిగతా వాళ్లను విడిచిపెడతాయి. వాళ్లతో పాటు కొత్త ఆటగాళ్లూ వేలంలోకి వస్తారు. చివరగా 2018 సీజన్‌కు ముందు ఈ మెగా వేలం జరిగింది. వచ్చే సీజన్ ముంగిట మళ్లీ ఆ వేలం జరగాల్సి ఉంది.
వచ్చే ఏడాది ఐపీఎల్ మెగావేలం లేనట్టే
వచ్చే ఏడాదిలో ఐపీఎల్ కోసం జరగాల్సిన మెగా వేలాన్ని వాయిదా వేయాలని బీసీసీఐ నిర్ణయించింది. అయితే 2021 లీగ్ కోసం చిన్నస్థాయిలో వేలాన్ని నిర్వహించనుంది. 2022లో మెగావేలాన్ని నిర్వహించి ఆ ఏడాదిలోనే మరో రెండు జట్లను లీగ్‌లో చేర్చడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.
వచ్చే ఏడాది ఐపీఎల్ మెగావేలం లేనట్టే!
కానీ ఐపీఎల్ 13వ సీజన్ ఆలస్యంగా జరిగిన నేపథ్యంలో తర్వాతి సీజన్‌కు పెద్దగా సమయం లేకపోవడం వల్ల ఈసారికి మెగా వేలాన్ని వాయిదా వేయాలని బీసీసీఐ నిర్ణయించింది. ఈసారికి ఫిబ్రవరిలో చిన్న స్థాయిలోనే వేలాన్ని నిర్వహించనున్నారు. 2022 సీజన్ ముంగిట మెగా వేలం జరగనుంది. 2022కు అదనంగా లీగ్‌లోకి రెండు జట్లను చేర్చనుండటం కూడా మెగా వేలం వాయిదాకు ఓ కారణం.
ఇదీ చూడండి:'కెప్టెన్' రహానె.. తనదైన ముద్ర వేస్తాడా?