రంజీ ట్రోఫీ ఫైనల్లో స్వరాష్ట్రం సౌరాష్ట్ర తరఫున ఆడాలనుకున్న రవీంద్ర జడేజాకు నిరాశే ఎదురైంది. ఈ టోర్నీలో బరిలో దిగే అవకాశమివ్వాలని బీసీసీఐను అభ్యర్ధించగా.. అందుకు అధ్యక్షుడు గంగూలీ ఒప్పుకోలేదట. దేశానికి ఆడటమే తొలి ప్రాధాన్యంగా బోర్డు భావించడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. మరోవైపు ఫైనల్ చేరిన బంగాల్ తరఫున మహ్మద్ షమిని ఆడించాలని ఆ రాష్ట్ర బోర్డు కోరినా, అతడికీ ప్రతికూల స్పందన వచ్చినట్లు సమచారం.
రంజీ ఫైనల్లో జడేజా ఆడకపోవడానికి కారణం గంగూలీనా? - ganguly latest news
రవీంద్ర జడేజా... టీమిండియాలో ప్రస్తుతం కీలక ఆటగాడిగా రాణిస్తున్నాడు. రంజీ ట్రోఫీ ఫైనల్ సౌరాష్ట్ర తాజాగా చేరింది. ఈ జట్టుకు ఆడేందుకు అనుమతివ్వాలని బీసీసీఐను జడ్డూ కోరగా.. ఆ అభ్యర్ధనను తోసిపుచ్చింది బోర్డు.
"జడేజా.. దేశం తర్వాతే రంజీ మ్యాచ్"
ఈనెల 9 నుంచి 13వ తేదీ వరకు సౌరాష్ట్ర-బంగాల్ మధ్య రాజ్‌కోట్ వేదికగా రంజీ ఫైనల్ జరగనుంది. అదే సమయంలో దక్షిణాఫ్రికా.. భారత్‌లో పర్యటించనుంది. ఈనెల 12న ఇరుజట్ల మధ్య తొలి వన్డే జరుగనుంది. ఇందులో జడేజా, షమి ఉండే అవకాశముంది. ఈ నేపథ్యంలోనే రంజీ ట్రోఫీ ఫైనల్లో ఆడటానికి బీసీసీఐ అనుమతి నిరాకరించినట్లు తెలుస్తోంది.