టీమ్ఇండియా కిట్లకు స్పాన్సర్‌షిప్‌తో పాటు వ్యాపార హక్కుల కోసం బీసీసీఐ టెండర్లను ఆహ్వానించింది. గత 14 ఏళ్లుగా నైక్ సంస్థ భారత జట్టుకు కిట్ స్పాన్సర్‌గా వ్యవహరిస్తోంది. అయితే ఈ ఏడాది సెప్టెంబరుతో ఒప్పందం ముగియనుంది. ఈ నేపథ్యంలో బీసీసీఐ తాజా నిర్ణయం తీసుకుంది. మరోవైపు నైక్‌తో ఒప్పందం పునరుద్ధరణకు భారత బోర్డు సిద్ధంగా లేదని అధికారిక వర్గాలు తెలిపాయి.
టీమ్ఇండియా కిట్లకు స్పాన్సర్షిప్ కావలెను!
భారత క్రికెట్ జట్టు కిట్లకు స్పాన్సర్షిప్ కోసం బిడ్స్‌ను ఆహ్వానించింది బీసీసీఐ. ఈ ఏడాది సెప్టెంబరు నాటికి నైక్‌తో కుదుర్చుకున్న ఒప్పందం ముగియనున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది.
బీసీసీఐ
ఇన్విటేషన్ టు టెండర్(ఐటీటీ) ప్రకారం ఈ టెండర్‌ను సొంతం చేసుకున్న బిడ్డర్లకు.. కిట్ స్పాన్సర్‌షిప్‌తో పాటు మర్చండైజింగ్ భాగస్వామ్యం, ఇతర అనుబంధ హక్కులు కూడా లభిస్తాయి. ఆసక్తిగల వ్యక్తులు మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు marketing@bcci.tvని సంప్రదించాలని బీసీసీఐ తెలిపింది.
Last Updated : Aug 3, 2020, 8:01 PM IST