తెలంగాణ

telangana

ETV Bharat / sports

ధోని లేకుండానే సఫారీలతో భారత్​ టీ-20 పోరు

దక్షిణాఫ్రికాతో సెప్టెంబరు 15 నుంచి ఆరంభం కానున్న టీ-20 సిరీస్​కు జట్టును ప్రకటించింది బీసీసీఐ. కెప్టెన్ కోహ్లీ సహా 15 మందితో కూడిన జట్టును ఎంపిక చేసింది. ఇందులో ధోనికి చోటు కల్పించకపోవడం గమనార్హం.

టీమిండియా

By

Published : Aug 29, 2019, 9:39 PM IST

Updated : Sep 28, 2019, 7:19 PM IST

వెస్టిండీస్ పర్యటన అనంతర కొద్ది విరామంలో మరో సిరీస్​కు సిద్ధం కానుంది టీమిండియా. దక్షిణాఫ్రికాతో మూడు టీ ట్వంటీలు ఆడనుంది. తాజాగా ఈ సిరీస్​కు జట్టును ప్రకటించింది బీసీసీఐ. సెప్టెంబర్ 15 నుంచి 22వ వరకు ఈ మ్యాచ్​లు జరగనున్నాయి.

సఫారీలతో ఆడే భారత జట్టు ఇదే..

విరాట్ కోహ్లీ(కెప్టెన్), రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, శిఖర్ ధావన్, శ్రేయస్ అయ్యర్, మనీశ్ పాండే, రిషభ్ పంత్ (కీపర్), హార్దిక్ పాండ్య, రవీంద్ర జడేజా, కృణాల్ పాండ్య, వాషింగ్టన్ సుందర్, రాహుల్ చాహర్, ఖలీల్ అహ్మద్, దీపక్ చాహర్, నవదీప్ సైని

ఈ జట్టులో ధోనికి చోటు కల్పించకపోవడం గమనార్హం. ప్రపంచకప్ అనంతరం కాస్త విరామం తీసుకున్న మహీ దక్షిణాఫ్రికా సిరీస్​లో ఆడతాడని అభిమానులు ఆశించారు. అయితే 2020 ప్రపంచకప్​ను దృష్టిలో ఉంచుకుని రిషభ్​ పంత్​ వైపే సెలక్టర్లు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది.

దక్షిణాఫ్రికాతో 3 టీ20లు ఆడనుంది టీమిండియా. సెప్టెంబరు 15 నుంచి 22 వరకు ఈ మ్యాచ్​లు జరగనున్నాయి. మొదటి మ్యాచ్​కు ధర్మశాల, రెండో టీ20కి మొహాలీ, మూడో మ్యాచ్​కు బెంగళూరు వేదిక కానున్నాయి.

ఇది చదవండి: 'ఇతర క్రీడాకారులకంటే క్రికెటర్లకే గుర్తింపు ఎక్కువ'

Last Updated : Sep 28, 2019, 7:19 PM IST

ABOUT THE AUTHOR

...view details