టీమ్ఇండియా మాజీ మహిళా క్రికెటర్ నీతూ డేవిడ్‌కు అరుదైన గౌరవం దక్కింది. భారత మహిళా సెలక్షన్ కమిటీ ప్యానెల్‌కు ఛైర్మన్‌గా ఎంపికైంది. ఈ విషయాన్ని బీసీసీఐ ట్వీట్ చేసింది.
మహిళా సెలక్షన్ ప్యానెల్‌కు ఛైర్మన్‌గా నీతూ
టీమ్ఇండియా మహిళా సెలక్షన్ కమిటీ ప్యానెల్‌కు ఛైర్మన్‌గా మాజీ క్రికెటర్ నీతూ డేవిడ్ ఎంపికైంది. ఈ విషయాన్ని బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది.
నీతూ డేవిడ్
ఈ ప్యానెల్లో నీతూతో కలిపి మరో నలుగురు మాజీ మహిళా క్రికెటర్లు మితూ ముఖర్జీ, రేను మార్గ్రెట్, ఆర్తి వైద్య, వి. కల్పన ఉన్నారు. కెరీర్లో పది టెస్టులాడిన నీతు.. 41 వికెట్లు తీసి 25 పరుగులు చేసింది. 97 వన్డేల్లో 141 వికెట్లు తీసి 74 పరుగులు చేసింది. తిరుగులేని బౌలర్‌గా పేరు గాంచిన ఈమె.. 2008లో రిటైర్మెంట్ ప్రకటించింది.
ఇదీ చూడండి ఐపీఎల్లో 'టాస్' లెక్క తప్పుతోంది!