తెలంగాణ

telangana

ETV Bharat / sports

'బెట్టింగ్​ న్యాయబద్ధమైతేనే... క్రికెట్​లో అవినీతి అంతం'

భారత క్రికెట్​లో అవినీతిని అరికట్టడానికి ఓ మార్గం ఉందని చెప్పారు బీసీసీఐ అవినీతి నిరోధక విభాగం(ఏసీయూ) చీఫ్​ అజిత్​ సింగ్​ షెకావత్​. మ్యాచ్​ ఫిక్సింగ్​ చట్టాన్ని సవరించి బెట్టింగ్​ను న్యాయబద్ధం చేయాలని అభిప్రాయపడ్డారు.

By

Published : Sep 17, 2019, 6:27 PM IST

Updated : Sep 30, 2019, 11:20 PM IST

'బెట్టింగ్​ న్యాయబద్ధమైతేనే... క్రికెట్​లో అవినీతి అంతం'

తమిళనాడు ప్రీమియర్ లీగ్​లో(టీఎన్​పీఎల్​) మ్యాచ్ ఫిక్సింగ్ ఉదంతం ఇటీవల చర్చనీయాంశమైంది. తాజాగా మ్యాచ్ ఫిక్సింగ్​ అంశంపై స్పందించారు బీసీసీఐ అవినీతి నిరోధక విభాగం చీఫ్​ అజిత్​ సింగ్​ షెకావత్​. స్పాట్​ ఫిక్సింగ్​ను ఆపలేమని అభిప్రాయపడిన ఆయన.. ఇది అరికట్టేందుకు మ్యాచ్​ ఫిక్సింగ్​ చట్టాన్ని సవరించి బెట్టింగ్​ను న్యాయబద్ధం చేయాలన్నారు.

బీసీసీఐ అవినీతి నిరోధ విభాగం(ఏసీయూ) చీఫ్​ అజిత్​ సింగ్​ షెకావత్

" స్పాట్ ఫిక్సింగ్​ను ఆపలేం. దానికి వ్యతిరేకంగా మ్యాచ్ ఫిక్సింగ్ చట్టం అవసరం. ఈ అంశంపై కచ్చితమైన చట్టం ఉంటే పోలీసులు ఇంకా మెరుగ్గా పనిచేయగలరు. బెట్టింగ్​ను చట్టబద్ధం చేయడం వల్ల అవినీతిని నియంత్రించవచ్చు. నిబంధనలు పక్కాగా రూపొందించినపుడు నియంత్రణ సాధ్యం అవుతుంది. ప్రభుత్వానికీ భారీ ఆదాయం లభిస్తుంది. అది ఎక్సైజ్ శాఖ రాబడికి సమానంగా ఉంటుంది. క్రీడలపై పెడుతున్న బెట్టింగ్ ధనం ఎంతో తెలిస్తే నోరెళ్లబెట్టడం ఖాయం"
-- అజిత్​ సింగ్​ షెకావత్​, బీసీసీఐ అవినీతి నిరోధక విభాగం

ఆదాయంతో పాటు చాలా అంశాలు ప్రభుత్వ పరిగణనలో ఉన్నాయని... బెట్టింగ్​ను చట్టబద్ధం చేయడాన్ని పరిశీలిస్తే ఫలితాలు ఉంటాయని వ్యాఖ్యానించారు అజిత్​.

" ప్రస్తుతం బెట్టింగ్ చట్టబద్ధం కాదు. ఒక్కసారి చట్టం చేశారంటే ఎవరు బెట్టింగ్ చేస్తున్నారు? ఎంత పందెం కాస్తున్నారో సులభంగా తెలుస్తుంది. అప్పుడు చట్టాన్ని అతిక్రమించేవారికి కష్టం అవుతుంది. ప్రస్తుతం కేవలం వందల నుంచి వేల రూపాయల్లో జరిమానా మాత్రమే విధిస్తున్నారు. ఇందువల్ల సులభంగా తప్పించుకుంటున్నారు"
--అజిత్​ సింగ్​ షెకావత్​, బీసీసీఐ అవినీతి నిరోధ విభాగం

భారత మహిళా క్రికెట్ జట్టుతో పాటు తమిళనాడు ప్రీమియర్ లీగ్(టీఎన్‌పీఎల్)లో ఫిక్సింగ్ కలకలం రేగింది. ఈ ఏడాది ఆరంభంలో స్వదేశంలో ఇంగ్లాండ్​తో జరిగిన సిరీస్‌లో ఫిక్సింగ్‌కు పాల్పడాలని... కొందరు తనను సంప్రదించారని ఓ భారత మహిళా క్రికెటర్ బీసీసీఐ అవినీతి నిరోధక విభాగానికి(ఏసీయూ) ఫిర్యాదు చేయడం సంచలనం రేపింది.

తమిళనాడు ప్రీమియర్ లీగ్‌లోనూ మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందనే అనుమానంతో... ఇద్దరు కోచ్‌లు సహా కొందరు ఫస్ట్‌క్లాస్ ప్లేయర్లు, లీగ్ అధికారులపై బీసీసీఐ ఏసీయూ నిఘా ఉంచింది.

ఇదీ చదవండి....

Last Updated : Sep 30, 2019, 11:20 PM IST

ABOUT THE AUTHOR

...view details