తెలంగాణ

telangana

ETV Bharat / sports

'రెండో టీ20పై ఆత్మవిశ్వాసంతో ఉన్నాం'

రాజ్​కోట్ వేదికగా జరగనున్న రెండో టీ20కి ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతామని చెబుతున్నాడు బంగ్లా ఆల్​రౌండర్​ ఆఫిఫ్ హొస్సేన్. తొలి టీ20లో తమ కెప్టెన్ మహ్మదుల్లా మంచి వ్యూహాలు రచించాడని తెలిపాడు.

ఆఫిఫ్ హొస్సేన్

By

Published : Nov 6, 2019, 10:02 AM IST

భారత్​తో రెండో టీ-20 కోసం ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతామని ఆ జట్టు ఆల్​రౌండర్ ఆఫిఫ్ హొస్సేన్ అన్నాడు. తొలి టీ20లో జట్టు సమష్టిగా రాణించిందని, అత్యుత్తమంగా ఆడాలని కెప్టెన్ మహ్మదుల్లా తమలో ఆత్మస్థైర్యాన్ని నింపాడని చెప్పాడు.

"మైదానంలో దూకుడుగా ఆడాలని మా కెప్టెన్ మహ్మదుల్లా చెప్పాడు. అందరూ అత్యుత్తమ ప్రదర్శన చేయాలని, సమష్టిగా రాణించాలని మాలో ఆత్మస్థైర్యాన్ని నింపాడు. ఫీల్డ్​లో మాకు అదే ఉపయోగపడింది. బ్యాటింగ్ చేయడానికి నాకు అవకాశం రాలేదు.. వచ్చినట్లయితే అత్యుత్తమంగా ఆడేవాడిని" -ఆఫిఫ్ హొస్సేన్ , బంగ్లా ఆల్​రౌండర్

ప్రస్తుతం సిరీస్ గెలవడం మాత్రమే తమ ఉద్దేశం కాదని, అత్యుత్తమ ప్రదర్శన చేసేందుకే ప్రయత్నిస్తామని చెప్పాడు మహ్మద్.

"బంతి నా చేతిలో ఉన్నప్పుడు.. వికెట్లు తీసేకంటే ఎక్కువగా డాట్ బాల్స్​ వేసేందుకే ప్రయత్నిస్తా. భారత్​తో సిరీస్ నాకు ఇదే మొదటి సారి. ఇంతకుముందు వేరే జట్లతో ఆడినపుడు అక్కడ చేసిన తప్పులు తెలుసుకున్నా. అందుకని సిరీస్ గెలవడమే లక్ష్యం కాకుండా.. అత్యుత్తమ ప్రదర్శన కనబర్చేందుకే మేము ప్రయత్నిస్తాం" -ఆఫిఫ్ హొస్సేన్ , బంగ్లా ఆల్​రౌండర్

దిల్లీ వేదికగా జరిగిన తొలి టీ20లో భారత్​పై బంగ్లా 7 వికెట్ల తేడాతో గెలిచింది. ఈ మ్యాచ్​లో ఆఫిఫ్ 3 ఓవర్లలో 11 పరుగులిచ్చి ఓ వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు. రాజ్​కోట్​ వేదికగా శనివారం రెండో టీ20లో తలపడనుంది టీమిండియా.

ఇదీ చదవండి: ఆసియా ఛాంపియన్​షిప్​లో పసిడి నెగ్గిన మను బాకర్

ABOUT THE AUTHOR

...view details