తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఆసీస్​తో పోరుకు భారత్​.. తొలి వన్డేలో ఏం చేస్తారో? - విరాట్​ కోహ్లీ వార్తలు

భారత్-ఆస్ట్రేలియా మధ్య శుక్రవారం(నవంబరు 27) తొలి వన్డే జరగనుంది. గత ఓటమికి భారత్​పై ప్రతీకారం తీర్చుకోవాలని ఆసీస్​ ప్రణాళికలు రచిస్తుండగా.. మరోసారి ప్రత్యర్థిపై ఆధిపత్యం చలాయించాలని టీమ్​ఇండియా చూస్తోంది. మరి ఏమవుతుందో చూడాలి.

Back in Blue: Rohit-less India venture into unknown against mighty Oz
ఆస్ట్రేలియా వర్సెస్​ భారత్​

By

Published : Nov 27, 2020, 10:52 AM IST

లాక్​డౌన్ తర్వాత భారత జట్టు ఆడే తొలి అంతర్జాతీయ మ్యాచ్​కు సర్వం సిద్ధమైంది. సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో తొలి వన్డే శుక్రవారం ఆడనుంది. ​స్టార్​ క్రికెటర్​ రోహిత్​ శర్మ లేకుండానే బరిలోకి దిగనుంది. ఇదే మ్యాచ్​తో రెట్రో జెర్సీ(1992 ప్రపంచకప్​లో వేసుకున్న​ జెర్సీ) ధరించి మన క్రికెటర్లు మైదానంలో కనిపించనున్నారు.

టీమ్​ఇండియా జట్టు

ఆల్​రౌండర్​ ప్రదర్శన చేస్తుందా?

రోహిత్​ అందుబాటులో లేని కారణంగా ఓపెనర్లుగా శిఖర్​ ధావన్​తో పాటు అనుభజ్ఞుడైన మయాంక్ అగర్వాల్​ లేదా యువ క్రికెటర్​ శుభ్​మన్​ గిల్​ను బరిలో దింపే అవకాశం ఉంది. అలానే ఆస్ట్రేలియా బౌలర్లైన మిచెల్​ స్టార్క్​, పాట్​ కమిన్స్​ ఎదుర్కొవడం భారత ఓపెనర్లకు పెద్ద సవాలుగా మారనుందని చెప్పడంలో సందేహం లేదు.

కెప్టెన్ కోహ్లీతో పాటు వికెట్​ కీపర్​ కేఎల్​ రాహుల్​, శ్రేయస్ అయ్యర్​లతో మిడిల్​ ఆర్డర్​ బలంగా ఉంది. ఆల్​రౌండర్లు హార్దిక్ పాండ్య, రవీంద్ర జడేజాలను జట్టు అవసరాలకు తగ్గట్టు ఉపయోగించుకునే అవకాశం ఉంది.

గాయం కారణంగా పేసర్​ భువనేశ్వర్​ అందుబాటులో లేని కారణంగా బౌలర్లు జస్​ప్రీత్​ బుమ్రా, మహ్మద్​ షమిలపై ఎక్కువ భారం పడనుంది. ఒకవేళ వీరిద్దరిలో ఒకరికి విశ్రాంతి లభిస్తే వారి స్థానంలో శార్దూల్​ ఠాకూర్​ లేదా నవదీప్ సైనీని ఆడించే అవకాశం ఉంది. మరోవైపు స్పిన్నర్లుగా చాహల్​, కుల్దీప్​ యాదవ్​ బరిలో దిగనున్నారు.

భారత బౌలర్ల ధాటికి నిలుస్తారా?

టీమ్​ఇండియా పేసర్లు జస్​ప్రీత్​ బుమ్రా, మహ్మద్​ షమిలను ఎదుర్కొవడానికి ఆస్ట్రేలియా జట్టు నుంచి ఆరోన్​ ఫించ్​, డేవిడ్​ వార్నర్​ ఓపెనర్లుగా వచ్చే అవకాశం ఉంది. ఇటీవలే తన బ్యాటింగ్​లో ఫామ్​ను తిరిగి గాడిలో పెట్టినట్లు వెల్లడించిన స్టీవ్​ స్మిత్​ మూడో స్థానంలో బ్యాటింగ్ చేయనున్నాడు.

ప్రాక్టీసు చేస్తున్న ఆస్ట్రేలియా క్రికెటర్లు

ఒకవేళ భారత బౌలర్ల ధాటికి టాప్​ ఆర్డర్​ విఫలమైతే ఆల్​రౌండర్​ మార్కస్​ స్టోయినిస్​, గ్లెన్​ మ్యాక్స్​వెల్​, అలెక్స్​ కారీలు మిడిల్​ఆర్డర్​లో బ్యాటింగ్​కు రానున్నారు​. బౌలింగ్​ లైనప్​లో మిచెల్ స్టార్క్​, పాట్​ కమ్మిన్స్​ భారత బ్యాట్స్​మెన్​ ఎదుర్కొవడానికి పక్కా ప్రణాళికలను రూపొందిస్తున్నారు.

50 శాతం వీక్షకులు

సిడ్నీ వేదికగా భారత్​, ఆస్ట్రేలియా మధ్య తొలి వన్డే జరగనుంది. భారత కాలమానం ప్రకారం ఉదయం 9:10 గంటలకు మ్యాచ్​ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్​ను వీక్షించేందుకు 50 శాతం ప్రేక్షకులను స్టేడియంలోకి అనుమతించనున్నారు. పరిమిత ఓవర్ల సిరీస్​ టికెట్లు అతి తక్కువ సమయంలోనే అమ్ముడుపోయాయని క్రికెట్​ ఆస్ట్రేలియా ఓ ప్రకటనలో తెలిపింది.

జట్టు(అంచనా)

భారత్: విరాట్ కోహ్లీ (కెప్టెన్), శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, హార్దిక్ పాండ్య, మయాంక్ అగర్వాల్, రవీంద్ర జడేజా, చాహల్, జస్​ప్రీత్​ బుమ్రా, మహ్మద్​ షమి, నవదీప్ సైనీ

ఆస్ట్రేలియా:ఆరోన్ ఫించ్ (కెప్టెన్), డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్, లబుషేన్, గ్లెన్ మ్యాక్స్​వెల్​, మార్కస్ స్టోయినిస్, పాట్ కమ్మిన్స్, స్టార్క్, హేజిల్‌వుడ్, హెన్రిక్స్, డేనియల్ సామ్స్

ABOUT THE AUTHOR

...view details