ఇటీవలే పాకిస్థాన్ లాహోర్‌కు చెందిన ఎనిమిదేళ్ల సామియా అఫ్సర్.. క్రికెట్ ప్రాక్టీస్ చేస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. ఈ క్రమంలోనే అనేక మంది క్రికెటర్లు ఈ చిన్నారి క్రికెటర్‌పై ప్రశంసలు కురిపించారు. తాజాగా, సామియాకు ఎంతో ఇష్టమైన పాక్ బ్యాట్స్‌మన్ బాబర్ అజామ్.. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంభాషించాడు. ఈ క్రమంలోనే సామియా ఆటతీరును ప్రశంసించాడు బాబర్. ఆమె బ్యాటింగ్ టైమింగ్ అద్భుతమని అన్నాడు. ఇంకా మంచి బ్యాట్స్‌మన్‌గా ఎలా రాణించాలో కొన్ని చిట్కాలనూ పంచుకున్నాడు బాబర్.
ఈ సంభాషణ అనంతరం బాబర్ మాట్లాడుతూ.. "ఆటలో ఆభిమానులు అంతర్భాగమైపోతారు. వారే మమ్మల్ని గెలుపు దిశగా ప్రేరేపిస్తారు. ఇటువంటి వారు మా విజయం కోసం ప్రార్థిస్తూ.. మా వెనకే ఉన్నారని తెలిసినప్పుడు మరింత ఉత్సాహంతో మ్యాచ్‌ను అడతాం." అని బాబర్ పేర్కొన్నాడు.