2018లో బాల్ టాంపరింగ్ వివాదం కారణంగా ఏడాది పాటు నిషేధానికి గురయ్యారు ఆస్ట్రేలియాకు చెందిన స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్. దీనితోపాటే స్మిత్.. రెండేళ్ల పాటు కెప్టెన్సీ పదవి చేపట్టడానికి వీల్లేదని క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) ఆదేశించింది. ఈ ఘటన జరిగి రెండేళ్లు పూర్తయిన క్రమంలో స్మిత్.. మరోసారి కెప్టెన్సీ బాధ్యతలను చేపట్టనున్నాడు. ఇప్పుడు ఈ విషయంపై స్పందించాడీ బ్యాట్స్మన్.
''ది హండ్రెడ్' క్రికెట్ లీగ్ ప్రారంభమైన తొలి ఏడాదే వెల్ష్ ఫైర్ జట్టుకు నాయకత్వం వహించే అవకాశం రావటం నాకు దక్కిన గౌరవంగా భావిస్తాను" - స్టీవ్ స్మిత్, ఆస్ట్రేలియా క్రికెటర్